UPDATES  

NEWS

సారపాకలో బి ప్రకాష్ రావు మాతృమూర్తి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న టి ఎస్ యు టి ఎఫ్ భద్రాది జిల్లా నాయకులు 

తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వెంకటేశ్వర్లు సారపాకలో జరిగిన బి ప్రకాష్ రావు మాతృమూర్తి దశదిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యాకూబ్ పాషా, సామాజిక మాధ్యమ సభ్యుడు మంగీలాల్ నాయక్,పాల్వంచ మండల ప్రధాన కార్యదర్శి హరి సింగ్ తదితరులు పాల్గొన్నారు.

లక్ష్యం దిశగా దూసుకుపోవాలి: జె.ఎన్.ఎస్ స్టేడియంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు !

క్రీడాకారులకు పోరాట సూర్తిని నింపిన సెక్రటరీ వెంకటస్వామి కోచ్ స్నేహ హనుమకొండ:మార్చి08 (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ (జె.ఎన్.ఎస్) ఇండోర్ స్టేడియం ఆదివారం మహిళా చైతన్యానికి వేదికైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, స్టేడియంలో ప్రతిరోజూ కఠిన సాధన చేసే క్రీడాకారిణులు,మరియు క్రీడాకారులు తమ ప్రాక్టీస్ అనంతరం ఉత్సాహంగా వేడుకలు నిర్వహించుకున్నారు. క్రీడా ప్రాంగణమంతా బాలికల కేరింతలు, ఒకరికొకరు చెప్పుకున్న శుభాకాంక్షలతో సందడిగా మారింది. ఈ వేడుకల్లో హనుమకొండ జిల్లా తైక్వాండో […]

ప్రభుదయాల్‌ పాత అనుబంధాలతో సింగరేణి సి.యం.డి

ఇటీవల సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ ఎండీగా నియమితులైన డా.బుద్ధ ప్రకాష్ జ్యోతి కొత్తగూడెం పర్యటనలో భాగంగా పాత అనుబంధాలను గుర్తుచేసుకున్నారు.2007లో భద్రాచలం ఐటిడిఏ పీఓ పనిచేసిన సమయంలో గిరిజన విద్యా కళాశాల ప్రిన్సిపాల్‌గా సేవలందించిన డా. ప్రభుదయాల్ నివాసాన్ని సందర్శించారు. దయాల్ బాగోగులు తెలుసుకుని,ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుని వధూవరులను ఆశీర్వదించారు. తన హయాంలో కళాశాలకు జాతీయ ఉపాధ్యాయ మండలి గుర్తింపు,బీఈడీ 200 సీట్లు,నూతన భవనాలు, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం,అలాగే ఇగ్నో (IGNOU) స్టడీ […]

ఇస్రో యువికా–26కు దరఖాస్తులు ఆహ్వానం: భద్రాది జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్

విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్’ (యువికా–26)కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.ఈ కార్యక్రమం శాస్త్ర, సాంకేతిక,ఇంజనీరింగ్,గణిత రంగాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు మంచి వేదికగా నిలుస్తోంది.ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల్లో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.ఎంపికలో 8వ తరగతి మార్కులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు క్విజ్‌లు,విజ్ఞాన సదస్సులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, గ్రామీణ విద్యార్థులకు వెయిటేజ్ మార్కులు కేటాయిస్తారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 31 […]

భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం

భద్రాచలం డివిజన్ లో పిఆర్టియు టి ఎస్ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు దశమ బాబు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ హాజరై మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కలిసి జిల్లాలో సంఘ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.అలాగే జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా సీనియర్ నాయకులు దనికొండ శ్రీనివాసరావు,దశమ బాబు,మంగయ్య,నాగులు జిల్లా శాఖకు పలు సూచనలు, సలహాలు […]

మండల స్థాయి బాల మేళా 2.0 విజయవంతం : ఎంఇఓ కృష్ణయ్య

లక్ష్మీదేవి పల్లి మండలం మండల స్థాయి బాలమేళా పూర్తిస్థాయిలో విజయవంతమైందని ఎంఈఓ పి కృష్ణయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ స్థాయి బాల మేళాలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.వివిధ నైపుణ్యాల ను సృజనాత్మకతను ప్రదర్శించారు.అనంతరం విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంఇఓ కృష్ణయ్య తో పాటు కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, కాంప్లెక్స్ సెక్రటరీలు మరియు మండలంలోని పలు పాఠశాలల ఉపాధ్యాయుని, ఉపాద్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరణ

కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుజాతనగర్ 21 వ డివిజన్ పరిధిలో గల గొల్లగూడెం గ్రామానికి చెందిన చైతన్య హమాలి ముఠా మెస్త్రి వీర్ల మల్లేశ్వర రావు,సరస్వతి ల ఏకైక కూమార్తె  లక్ష్మీ ప్రసన్న వివాహ వేడుక సందర్భంగా  కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరించి నూతన వధువుకు  ఆశీర్వాదం అందజేసారు.ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు,భద్రాద్రి జిల్లా సీపీఎం పార్టీ […]

హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న లక్ష్మీదేవిపల్లి పంచాయతీ సిబ్బంది

లక్ష్మీదేవి పల్లి మండలం లక్ష్మీదేవి పల్లి పంచాయతీ సిబ్బంది హోలీ పండుగను సంబరంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా (ఏ టి ఈ సి) అలయెన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ క్లబ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బాలునాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి పల్లి పంచాయతీ సిబ్బంది పారిశుధ్య పనులు పర్యవేక్షించే పుష్ప రాజ్, సీనియర్ పంచాయతీ డ్రైవర్ సింగ్,లింగయ్య,శివ,నాగరాజు, మహాలక్ష్మి,చక్రవర్తి జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు

కేజీబీవీ,యుఆర్‌ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై మూడు దశల పోరాటం:టీఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు.

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు మరియు పట్టణ గురుకులాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది మరియు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా మూడు దశల పోరాటం చేపట్టాలని నిర్ణయించినట్లు టీఎస్‌ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రాజు తెలిపారు.కేజీబీవీ, యుఆర్‌ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో […]

రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా !

హనుమకొండ:మార్చి03 (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) హనుమకొండలోని జిల్లా ఇండోర్ స్టేడియం రంగుల లోకమైంది. నిత్యం కఠినమైన శిక్షణతో, క్రమశిక్షణతో కూడిన మార్షల్ ఆర్ట్స్ సాధన చేసే తైక్వాండో విద్యార్థులు మంగళవారం హోలీ పండుగను పురస్కరించుకుని అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకున్నారు. ప్రతిరోజూ లాగే ఉదయం స్టేడియంలో తమ కోచ్,స్నేహ ఆధ్వర్యంలో కఠినమైన ప్రాక్టీస్ పూర్తి చేసిన విద్యార్థులు, అనంతరం ఒక్కసారిగా పండుగ వాతావరణంలోకి మారిపోయారు.సాధన సమయంలో ప్రదర్శించే గంభీరత్వాన్ని పక్కన పెట్టి,చిన్నా పెద్దా తేడా లేకుండా […]