సర్వారాం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా శుభ్రత కార్యక్రమం: సర్పంచ్ భూక్యా సునీత రాంబాబు
సుజాతనగర్ మండలం సర్వారాం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్పంచ్ తండాలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా శుభ్రత పనులు నిర్వహించారు. సర్పంచ్ భూక్యా సునీత ఆదేశాల మేరకు డ్రైనేజీలను శుభ్రం చేయడంతో పాటు రోడ్డు పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా సర్పంచ్ పర్యవేక్షణలో 5వ వార్డులో డ్రైనేజీ పనులను పారిశుధ్య కార్మికులు పూర్తి చేశారు. గ్రామంలో పారిశుధ్యం మెరుగుపడేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
గొందిగూడెం పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ… మినీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం
అశ్వాపురం మండలం గొందిగూడెం బండ్ల సత్తయ్య గుంపు లో గిరిజన ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం అదనపు తరగతి గదులు,టాయిలెట్ నిర్మాణానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమిపూజ చేశారు.అనంతరం పాఠశాలలో మినీ ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ ప్లాంట్ ద్వారా విద్యార్థులకు త్రాగునీటి సౌకర్యం కల్పించడంపై ఐటిడిఏ ఈఈ మధుకర్, ఏఈ ప్రసాద్‌లను ఎమ్మెల్యే అభినందించారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రాజాపురం పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు
పాల్వంచ మండలంలో ఎంపిపిఎస్ పాఠశాల రాజాపురంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎనిమిదో రోజు పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు.పాఠశాల సమీపంలోని కాలువలు, డ్రైనేజీలు మూసుకుపోవడంతో నిల్వైన నీటిని ఉపాధ్యాయులు, గ్రామస్థులు కలిసి శుభ్రపరచి నీటి ప్రవాహం సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, సెక్రటరీ శ్రీనివాస్,పాఠశాల ఉపాధ్యాయులు, హెల్త్ వర్కర్లు, గ్రామస్థులు మరియు స్థానిక […]
ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని సర్పంచ్‌లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన సర్పంచ్‌లు ఈ శిక్షణకు లక్ష్మీదేవిపల్లి మండల సర్పంచ్ లు తాటి అనిత శిక్షణ మెటీరియల్ ను అందుకొని హాజరయ్యారు.ఈ సందర్భంగా శిక్షణకు అవసరమైన మెటీరియల్‌ను ఎంపీఓలు శ్రీనివాస్ అందజేశారు.
ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు
పాల్వంచ మండలం రాజాపురం ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పాఠశాల ఆవరణ భద్రతను పెంచడంతో పాటు పర్యావరణాన్ని అందంగా మార్చే లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నారు.ప్రహరీ గోడ నిర్మాణం పూర్తైన తర్వాత పాఠశాల పరిసరాలు మరింత భద్రంగా,శుభ్రంగా మరియు సుందరంగా మారనున్నాయి.పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న గ్రామపంచాయతీ పాలక పక్ష సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం
మాజీల వ్యవహారం నవ్విపోదురు గాక మాకేంటి అన్నట్టుగా ఉంది. సంఘానికి వెన్నుపోటు పొడిచి, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని సంఘం నుండి బహిష్కరణకు గురైన వారు ఇప్పుడు మరో సంఘంలో చేరి మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మీపై ఉన్న ఆరోపణలకు సమాధానాలు చెప్పకుండా వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో ఉపాధ్యాయుల నుండి వసూలు చేసిన బిల్డింగ్ ఫండ్ మొత్తం ఎంత, మండలాల వారీగా ఎంత వసూలు చేశారో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? […]
పాఠశాలల సమీపంలోని చిరుతిండి దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్
జిల్లాలోని బీసీ, ఎస్సీ, మైనారిటీ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు,ఏకలవ్య పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసి కార్యాలయంలో సంబంధిత జిల్లా అధికారులు, ఆహార భద్రత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇకపై కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం పరిశుభ్రంగా, నాణ్యంగా ఉండేలా ప్రత్యేక కార్యాచరణతో […]
కాలువల శుభ్రతతో ప్రజారోగ్యం – సర్పంచ్ జర్పుల దేవి
లక్ష్మీదేవిపల్లి మండలంలోని అశోక్ నగర్ కాలనీ గ్రామపంచాయతీలో 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా కొమరయ్య కాలనీలో డ్రైనేజీ కాలువలను సర్పంచ్ జర్పుల దేవి ఆధ్వర్యంలో శుభ్రపరిచారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మురుగు నీటిని తొలగించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచే చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చలమల సంధ్య, వార్డు మెంబర్ పడాల రమ, గ్రామపంచాయతీ కార్యదర్శి చింతల ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.మధుకర్ సుడిగాలి పర్యటన
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి. మధుకర్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. రాహుల్ ఐఎఎస్ ఆదేశాల మేరకు గిరిజన అభివృద్ధి పనులను వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు.ఒకే రోజులో కిన్నెరసాని గురుకుల పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ హోదాలో కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్ను సందర్శించి హెచ్‌ఎం,ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై […]
కవిత దీక్షకు మద్దతు తెలిపిన బిరుదురాజు వెంకటేశ్వర రాజు

హైదరాబాద్/కొత్తగూడెం (తెలంగాణ వాణి) ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఖమ్మంలో దీక్ష చేపట్టిన కవితను పోలీసులు బలవంతంగా హైదరాబాద్ తరలించిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలోనే ఆమె తన దీక్ష కొనసాగిస్తున్నారు. వెలుగుమట్ల భూ బాధితులకు న్యాయం జరిగి కూల్చిన ఇళ్ల స్థానంలోనే కొత్త నివాసాలు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేంత వరకూ తన నిరాహార […]