UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 పాఠశాలల సమీపంలోని చిరుతిండి దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

జిల్లాలోని బీసీ, ఎస్సీ, మైనారిటీ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు,ఏకలవ్య పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసి కార్యాలయంలో సంబంధిత జిల్లా అధికారులు, ఆహార భద్రత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇకపై కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం పరిశుభ్రంగా, నాణ్యంగా ఉండేలా ప్రత్యేక కార్యాచరణతో నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని తెలిపారు. ఆహారం కలుషితం కావడానికి గల కారణాలను ఆహార భద్రత అధికారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.పాఠశాలలు, వసతి గృహాల సమీప ప్రాంతాల్లో ఉన్న చిరు తిండ్ల దుకాణాలు, ఐస్‌క్రీమ్ బండ్లు మరియు ఇతర ఆహార విక్రయ కేంద్రాలపై ఆహార భద్రత అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. విక్రయించే ఆహార పదార్థాల గడువు తేదీలు, నాణ్యత, నిల్వ విధానాలను క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించారు. నాణ్యత లేని లేదా గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.పాఠశాలలకు బయట నుండి ఆహార పదార్థాలు తీసుకురావడం అనుమతించరాదని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాలల వంటగదులు,భోజన శాలలు పరిశుభ్రంగా ఉండేలా సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు.విద్యార్థుల ఆరోగ్య భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు.ఈ సమావేశంలో సీపీఓ సంజీవరావు, బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, ఎస్సీ సంక్షేమ అధికారి శ్రీలత, ఆహార భద్రత అధికారి శరత్, ఆర్‌సీఓలు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest