లయన్స్ క్లబ్ ఆఫ్ టేకులపల్లి ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ
లయన్స్ క్లబ్ ఆఫ్ టేకులపల్లి ఆధ్వర్యంలో, సమాజ సేవకు నిదర్శనంగా నిలిచే ఒక గొప్ప సేవా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ప్రాంతంలోని చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేసి వారికి సహాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డిస్ట్రిక్ట్ జీఎస్టీ కోఆర్డినేటర్ గుడిపురి వెంకటేశ్వరరావు మరియు రీజనల్ చైర్ పర్సన్ సత్యనారాయణ తమ సాన్నిధ్యంతో కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిలిపారు.లయన్స్ క్లబ్ ఆఫ్ టేకులపల్లి అధ్యక్షులు కేస వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ […]
వెరిస్క్ అనలిటిక్స్ కంపెనీ సహకారంతో సుమారు రూ.3.5 లక్షల వ్యయంతో గిరిజన పాఠశాలకు అభివృద్ధి పనులు
గిరిజన పాఠశాలకు రూ.3.5 లక్షల అభివృద్ధి వసతులు బూర్గంపహాడ్ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో వెరిస్క్ అనలిటిక్స్ కంపెనీ ఆర్థిక సహకారంతో అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. సమరిటన్స్ ఫర్ ద నేషన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ రామ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సుమారు రూ.3.5 లక్షల వ్యయంతో అదనపు తరగతి గది, వాష్‌రూమ్ నిర్మించి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన […]
అందరూ సోదర భావంతో ముందుకు సాగుదామని,ఇఫ్తార్ విందులో జర్పుల మురళీ నాయక్
బుధవారం అశోక్ నగర్ కాలనీ మసీదు వద్ద నిర్వహించిన ఇఫ్తార్ విందులో జర్పుల మురళీ నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మసీదు పెద్దలు, అశోక్ నగర్ కాలనీ 1వ వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.ప్రతి సమస్య పరిష్కారానికి ముందుండే ప్రజల మనిషిగా పేరుగాంచిన జర్పుల మురళి, ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సమాజంలో అందరూ సోదరభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
విన్నూత్న బహుకరణతో ఆకట్టుకున్న ఈఈ మధుకర్ – రాజ్యాంగ గ్రంథం అందజేతపై చైర్మన్ ప్రశంసలు
భద్రాచలం పర్యటనలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను బి పి ఎల్ గెస్ట్ హౌస్‌లో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తాండ్ర మధుకర్ మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా గిరిజన ఇంజనీరింగ్ శాఖలో పోస్టులు పెంచి, అన్ని స్థాయిల్లో రెగ్యులర్ పదోన్నతులను అమలు చేయాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేయాలని ఆయన విన్నవించారు.అనంతరం భారత రాజ్యాంగ గ్రంథాన్ని చైర్మన్‌కు బహుకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ..తన పర్యటనలో ఇలాంటి విన్నూత్న బహుకరణ ఎవరూ […]
రేగళ్ల గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తాండ్ర మధుకర్
గిరిజన ఆశ్రమ పాఠశాల రేగళ్లను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తాండ్ర మధుకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాల మరియు హాస్టల్‌లో ఉన్న సివిల్ వర్క్ సమస్యలను హెచ్ ఎం, బోధన సిబ్బంది ఆయన దృష్టికి తీసుకువచ్చారు.వాటిని ప్రాజెక్ట్ అధికారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని మధుకర్ తెలిపారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులకు మెరుగైన మార్కులు సాధించేందుకు పలు సూచనలు చేశారు
ఐక్య తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో పట్టెడన్నం కార్యక్రమం
ఐక్య తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణ కేంద్రంలో పట్టెడన్నం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ రుద్రోజు మోహన్, చుంచుపల్లి మండలం వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పాల్గొని పేదలకు అన్నదానం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మారుతి రత్నాకర్ మాట్లాడుతూ..పట్టెడన్నం కార్యక్రమం ద్వారా పేదలకు ఒక పూట అన్నం అందించడం ఎంతో మంచి కార్యక్రమమన్నారు. సంఘం సభ్యులు తమ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు లేదా ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఈ […]
ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేసిన టిఎన్ఆర్ ట్రస్ట్
టిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరీమణులకు ఆదివారం రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా టిఎన్ఆర్ ట్రస్ట్ సభ్యులు తాండ్ర బుచ్చిబాబు,తాండ్ర నాగబాబు, మైనార్టీ అధ్యక్షుడు ఇక్బాల్ పాషా, ఉపసర్పంచ్ ఎర్రబడీ శ్రీను, వార్డు సభ్యులు శ్రీకాంత్,మాజీ సర్పంచ్ తాడూరి రజాక్, పొదిలి వెంకటాచలం (చిన్న) తదితరులు పాల్గొని ముస్లిం సోదరీ మణులకు రంజాన్ తోఫా అందజేశారు.రంజాన్ మాసం సందర్భంగా […]
ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు కారల్ మార్క్స్ : ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు,మహాతత్వవేత్త కారల్ మార్క్స్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ కూనంనేని సాంబశివరావు అన్నారు.మార్క్స్ 143వ జయంతిని శనివారం సుగుణ గార్డెన్స్లో ఘణంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటనికి పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్క్స్ ప్రతిపాదించిన సమానత్వభావాలు శ్రమ జీవుల హక్కుల కోసం చేసిన సిద్ధాంత పోరాటం ప్రపంచ వ్యాప్తంగా కార్మిక ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలిచిందన్నారు.సమాజంలో అసమానతలను తొలగించి నమాన హక్కులు సాధించాలన్న లక్ష్యంతో ఆయన చేసిన […]
పాల్వంచలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రముఖుల హాజరు
పాల్వంచ పట్టణ పరిధిలోని జగ్గుతండా నవభారత్ ఏరియాలో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు బంజారా సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ బానోత్ వీరు నాయక్, గ్రీన్ ఎర్త్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ రాథోడ్ హాజరయ్యారు.టోర్నమెంట్ నిర్వాహకులు లావుడియా గణేష్, బానోత్ ప్రతాప్, గుగులోత్ సేవ్య, యన్ పర్షి, గుగులోత్ బాలు, భూక్యా రమేష్ ఆహ్వానం మేరకు వారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ, క్రీడలు మానసిక ప్రశాంతతను కలిగించడంతో పాటు ఒత్తిడిని తట్టుకునే […]
బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF వినతి
AISF రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF నాయకులు వినతిపత్రం అందజేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించి విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా AISF జిల్లా కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతూ తెలంగాణలో పెండింగ్ స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.9,300 కోట్లు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం సకాలంలో బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లు పొందడంలో ఇబ్బందులు […]