UPDATES  

 ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్‌ కు మొక్కలు అందజేసిన

కొత్తగూడెం పట్టణంలోని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్‌ను ప్రకృతి ప్రేమికుడు, యంగ్ ఇండియ జాతీయ పురస్కార గ్రహీత బాలునాయక్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలను అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ వరుణ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని కాపాడాలని సూచించారు. సమాజ సేవలో భాగంగా ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తున్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఆంగ్ల ఉపాధ్యాయుడు బాలునాయక్‌ను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో ఖలీల్ అహ్మద్, ఇందిరా, అభి, సఫియా, శివ, యువరాజ్, రామన్న తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest