UPDATES  

NEWS

హుండీ దొంగను పట్టుకున్న ఎస్సై ప్రవీణ్ కుమార్

ధర్మారం (తెలంగాణ వాణి) గత కొంతకాలంగా పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం, సుల్తానాబాద్, పొత్కపల్లి మండలాలలో వివిధ గ్రామాల్లోని పలు దేవాలయాలలో ఉన్న హుండీలు పగులగొట్టి దొంగతనాలు చేస్తున్న కూకట్ల సదానందం ను పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు స్థానిక ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతను దేవాలయాలలోని హుండీలే లక్ష్యంగా చేసుకొని వాటిని పగలగొట్టి అందులో ఉన్నవి దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. గురువారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో సదానందం ధర్మారం మార్కెట్ […]

ఏకాత్మతా మానవతా వాద సిద్ధాంతమే దేశ అభివృద్ధికి మంత్రం – అర్బన్ ఎమ్మెల్యే నిజామాబాద్ సెప్టెంబర్ 25: (తెలంగాణ వాణి ప్రతినిధి) ఏకాత్మతా మానవతా వాద సిద్ధాంతమే దేశ అభివృద్ధికి మంత్రం అని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో, మారుతీ నగర్ స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ అర్ముర్ ఎమ్మెల్యే […]

ఆదర్శ పాఠశాల విద్యార్థుల వృత్తి వ్యాయామ విద్య ఇంటర్ను షిప్ కార్యక్రమం

ధర్మారం (తెలంగాణ వాణి) ధర్మారం ఆదర్శ పాఠశాల కళాశాలకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు వృత్తి వ్యాయామ విద్యకు సంబంధించి ఇంటర్నె డు శిక్షణ తీసుకుంటున్నారని ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఈరవేణి తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. తెలంగాణ సమగ్ర శిక్ష ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు కళాశాలకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ వ్యాయామ విద్య లెవెల్ నలుగురు విద్యార్థులు ఈ నెల 22 నుండి అక్టోబర్ 1 వరకు పది రోజుల […]

పిండివంటలు, బేకరి వ్యాపారం చేస్తాం అనుమతి ఇవ్వండి

14వ వార్డు డ్వాక్రా మహిళల విజ్ఞప్తి  కొత్తగూడెం (తెలంగాణ వాణి) మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు డ్వాక్రా మహిళలు మున్సిపాలిటీ కార్యాలయం ముందు పిండివంటలు, బేకరి కోసం కంటేనర్ పెట్టుకునేందుకు తమకు అవకాశం ఇప్పించవలసినదిగా మున్సిపల్ కమీషనర్ కు పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు మాట్లాడుతూ గతంలో మున్సిపల్ కమీషనర్, చైర్మన్, కౌన్సిలర్స్ ను కార్యాలయం ముందు కంటేనర్ ఏర్పాటుకు అనుమతి కోరగా రోడ్డు డ్రైన్స్, కాల్వలు మరమత్తులు ఉన్నాయని కొంత […]

జిఎస్టి తగ్గింపుపై హర్షం

ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం ధర్మారం (తెలంగాణ వాణి) జిఎస్టి తగ్గింపుపై హర్షం వ్యక్తం చేస్తూ ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్బంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కొరకు జిఎస్టి తగ్గించడం పట్ల మండల కేంద్రంలో వాణిజ్య వ్యాపారులతో కలిసి బిజెపి నాయకులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్టు తెలిపారు. […]

కార్మికులకు ఇచ్చే లాభాల్లో 50శాతం పైగా కోత విధించారని కాపు కృష్ణ ఆగ్రహం

కొత్తగూడెం సింగరేణి (తెలంగాణ వాణి) ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలొ మొత్తం రూ. 6394 కోట్ల లాభాలు గడిస్తే, కేవలం 2360 కోట్లలో 34శాతం ఇవ్వడం ఏమిటని తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ ప్రశ్నించారు. సోమవారం టీబీజీకేఎస్ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దసరా పండుగ పూట కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి చేదు కబురు చెప్పారని […]

మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

సుజాతనగర్ లో అంబరాని అంటేలా సంబరాలు  విజేతలకు బహుమతులు అందించిన తోట దేవిప్రసన్న, ఆళ్ల మురళి సుజాతనగర్ / కొత్తగూడెం (తెలంగాణ వాణి) బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ సుజాతనగర్ లో ఆదివారం సాయంత్రం ‘ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు’ భద్రాద్రి జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. తొలిరోజు వేడుకల్లో భాగంగా తంగేడు, గునుగు, బంతి, పట్నం బంతి, పట్టుకుచ్చు, తామర పువ్వు, గుమ్మడి పువ్వులతో బతుకమ్మలను అందంగా […]

బతుకమ్మ సంబరాలు జయప్రదం చేద్దాం : తోట దేవిప్రసన్న

నియోజకవర్గంలో బతుకమ్మ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు కొత్తగూడెం (తెలంగాణ వాణి) తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబురాలు నేటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపనున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న తెలిపారు. చుంచుపల్లి మండలం విద్యానగర్ లోని రెవిన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ […]

దేవిమాత మండపాలకు పట్టుచీరలు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే

నిజామాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి) ధన్ పాల్ లక్ష్మీబాయ్ అండ్ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్వాడి గల్లీ డీ ఎస్ ఎన్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పట్టుచీరాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు మరియు ట్రస్ట్ చైర్మన్ ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు దేవి నవరాత్రుల సందర్బంగా ఇందూర్ నగరంలోని దాదాపు 250 మండపాలకు పట్టుచీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.గత 11 ఏళ్ల నుండి తన […]

జర్నలిస్టు సాంబపై అక్రమ కేసులు ఎత్తివేయాలి: డీజీపీ ని కలిసిన టియుడబ్ల్యూజే నేతలు

హైదరాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిది) ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ, ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తున్న జర్నలిస్టులపై కక్ష పూరితంగా కేసులు పెట్టడం దుర్మార్గం అని టియుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19(1) ఏ మీడియా స్వేచ్ఛ హక్కును హరించే దిశగా ఇటు ప్రభుత్వం అటు పోలీసులు ఇలాంటి అక్రమ కేసులు బనాయించి జర్నలిస్టులను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో యూరియా […]