UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

డిఫాల్ట్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్టు అమలు చెయ్యండి

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్, సెప్టెంబర్ 12 : (తెలంగాణ వాణి ప్రతినిధి)

సీ.ఎం.ఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) అందించడంలో విఫలమైన డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై నిబంధనల మేరకు రెవెన్యూ రికవరీ యాక్టును అమలుపర్చాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తహసీల్దార్ లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. డిఫాల్ట్ మిల్లర్లపై ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, వారి నుండి రావాల్సిన మొత్తం ఎంత, ఇప్పటి వరకు ఎంత రికవరీ చేశారు తదితర వివరాలను ఒక్కో డిఫాల్ట్ రైస్ మిల్ వారీగా సంబంధిత మండల తహసీల్దార్ ను అడిగి తెలుసుకున్నారు. డిఫాల్ట్ రైస్ మిల్లులతో పాటు, మిల్లర్లకు చెందిన ఆస్తులను బ్లాక్ చేయించాలని, అవసరమైతే ఆస్తులను వేలం వేసి సీఎంఆర్ నిధులను రాబట్టే దిశగా చర్యకు తీసుకోవాలని కలెక్టర్ కరాఖండిగా తేల్చి చెప్పారు. సీ.ఎం.ఆర్ నిధులు పూర్తి స్థాయిలో రికవరీ కావాల్సిందేనని, నిబంధనల ప్రకారం కఠిన చర్యలతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇకనుండి తాను సీఎంఆర్ రికవరీపై ప్రతీ వారం సమీక్ష జరుపుతానని, ఎప్పటికప్పుడు ప్రగతి కనిపించాలని అన్నారు. ఈ సందర్భంగా భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ తహసీల్దార్లను ఆదేశించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం, సభ్యుల పేర్లను చేర్చాలని కోరుతూ వచ్చే దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ, అర్హులైన వారికి ఆమోదం తెలుపాలని అన్నారు. ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పక్కాగా విచారణ చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్  లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, కలెక్టరేట్ డీ-సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest