UPDATES  

NEWS

ఘనంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ.జయంతి

ఏన్కూర్ ఫిబ్రవరి 23: సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను సోమవారం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూల పోచారంలో ఘనంగా నిర్వహించారు. తొలుత సంత్ శ్రీ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి భోగ్ బండార్ పూజా కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు డిఎస్.నాగేశ్వరరావు పాఠశాల విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో పయనిస్తూ సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని […]

కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ అండ్ బి ఆర్ ఎస్ నాయకులు

కొత్తగూడెం నగరపాలక సంస్థలో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మూడ్ గణేష్ నాయక్‌ను పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా 38వ డివిజన్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్, విద్యార్థి విభాగం పాల్వంచ పట్టణ అధ్యక్షుడు జూపెళ్లి దుర్గాప్రసాద్, పాల్వంచ పట్టణ మహిళా అధ్యక్షురాలు బట్టు మంజుల, పార్టీ నాయకుడు వాసుమల్ల గౌతమ్ తదితరులు మేయర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు […]

ధర్మపురి సంజయ్ కి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి కేటాయించాలి

టీపీసీసీ చీఫ్ కు మున్నూరు కాపు కులస్తుల వినతి గాంధీభవన్ కు భారీగా తరలిన మున్నూరు కాపు ప్రతినిధులు. నిజామాబాద్ (తెలంగాణ వాణి) కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ కి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి కేటాయించాలని మున్నూరు కాపు కులానికి చెందిన ప్రతినిధులు కోరారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున సోమవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ కు తరలి వెళ్లారు. టిపిసిసి అధ్యక్షులు […]

ఘోర రోడ్డు ప్రమాదం RTC బస్సు బోల్తా

వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు   ఉట్నూర్ (తెలంగాణ వాణి) ఉట్నూర్ మండల షాంపుర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను 108 అంబులెన్స్ ద్వారా ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. 37 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. అందులో కండక్టర్ తోపాటు పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు సమయానికి స్పందించడంతో క్షతగాత్రులను […]

మల్యాల వరద కాలువలో కారు పడిపోవడంతో బీఆర్ఎస్ నాయకుడు తిర్మణి రమణ మృతి

జగిత్యాల, ఫిబ్రవరి 22 (తెలంగాణ వాణి): పెగడపల్లి మండలం మల్యాల వరద కాలువలో కారు పడిపోవడంతో బీఆర్ఎస్ నాయకుడు తిర్మణి రమణ మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సుద్ధపల్లి గ్రామానికి చెందిన తిర్మణి రమణ అనుమానాస్పద స్థితిలో కారుతో సహా మల్యాల వరద కాలువలో శవమై కనిపించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కారును బయటకు తీసి పరిశీలించగా అందులో రమణ మృతదేహం లభ్యమైంది. […]

రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి

సిరిసిల్ల, ఫిబ్రవరి 21 (తెలంగాణ వాణి): గోనె సొలోమోన్ రాజుకు రాష్ట్ర నామినేటెడ్ కార్పొరేషన్ పదవి ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. జిల్లా అధ్యక్షుడు రెవరెండ్ సామ్ కాల్వల మాట్లాడుతూ, సొలోమోన్ రాజు రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన కార్యకర్తగా పనిచేశారని పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం తగిన పదవి ఇవ్వాలని సంఘం విజ్ఞప్తి చేసింది. […]

వేములవాడ మున్సిపల్ నూతన పాలకవర్గానికి విప్ ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు

వేములవాడ: ఫిబ్రవరి 21 (తెలంగాణ వాణి): వేములవాడ మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పుల్కం రాజు మరియు వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నరాల శేఖర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్‌లను పూలమాలలతో సన్మానించి, వేములవాడ పట్టణ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. పట్టణ ప్రజల సమస్యల […]

కార్పొరేటర్ బత్తుల మధుచంద్ ను ఘనంగా సన్మానించిన మాల మహానాడు జిల్లా యూత్ అధ్యక్షులు వాసుమల్ల.గౌతమ్,తమ్మిశెట్టి ప్రసాద్,సాయి తేజ

పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 38వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించిన బత్తుల మధుచంద్ ను బిఆర్ఎస్ కార్యకర్తలు మరియు వివిధ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. టీచర్స్ కాలనీలోని ఆయన స్వగృహంలో ఎస్‌సి మాల మహానాడు జిల్లా యూత్ అధ్యక్షులు వాసుమల్ల గౌతమ్ ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు..ఈ కార్యక్రమంలో తమ్మిశెట్టి ప్రసాద్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న బండపల్లి సర్పంచ్

ఆడపిల్లల పెళ్లికి ₹5,016 ఆర్థిక సాయం చందుర్తి, ఫిబ్రవరి 20 (తెలంగాణ వాణి): చందుర్తి మండలం బండపల్లి గ్రామ సర్పంచ్ కటకం మల్లేశం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామంలో ఆడపిల్లల పెళ్లి జరిగితే ₹5,016 ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించిన ఆయన, ఆ మాట ప్రకారం మొదటి విడతగా రెండు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. గడ్డం మమత – మనోహర్ రెడ్డి దంపతుల కుమార్తె అద్విక రెడ్డి మరియు దర్శనాల సత్తయ్య – […]

ప్రజలకు అప్రమత్తత సూచనలు

వేములవాడ రూరల్, ఫిబ్రవరి 20 (తెలంగాణ వాణి): వేములవాడ పట్టణ శివారులోని హన్మక్కపల్లి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన రైతు రోమాల భూమయ్య పొలం వద్ద కట్టేసిన ఆవు దూడపై చిరుత దాడి చేసి చంపినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుత అడుగుల ఆనవాళ్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గస్తీ పెంచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వేములవాడ […]