UPDATES  

 ఘోర రోడ్డు ప్రమాదం RTC బస్సు బోల్తా

వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ఉట్నూర్ (తెలంగాణ వాణి) ఉట్నూర్ మండల షాంపుర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను 108 అంబులెన్స్ ద్వారా ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. 37 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. అందులో కండక్టర్ తోపాటు పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు సమయానికి స్పందించడంతో క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. క్షత గాత్రులను స్థానిక ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉదయం పొగమంచు ఎక్కువగా ఉండటం, ఇరుకైన వంతెన కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

ఈ ప్రమాదంపై మంత్రులు పొన్నం , జూపల్లి కృష్ణారావు లు స్పందించారు. ఈ ఘటనపై రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆదిలాబాద్ ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు గల కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు. ఇరుకైన శ్యామ్‌పూర్ బ్రిడ్జిపై ప్రొటెక్షన్ వాల్ లేకపోవడంతో ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని మంత్రులకు తెలిపారు అదికారులు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 23 February 2026, 12:54 pm Posted by : TELANGANA VANI

ఘోర రోడ్డు ప్రమాదం RTC బస్సు బోల్తా

వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ఉట్నూర్ (తెలంగాణ వాణి) ఉట్నూర్ మండల షాంపుర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను 108 అంబులెన్స్ ద్వారా ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. 37 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. అందులో కండక్టర్ తోపాటు పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు సమయానికి స్పందించడంతో క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. క్షత గాత్రులను స్థానిక ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉదయం పొగమంచు ఎక్కువగా ఉండటం, ఇరుకైన వంతెన కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

ఈ ప్రమాదంపై మంత్రులు పొన్నం , జూపల్లి కృష్ణారావు లు స్పందించారు. ఈ ఘటనపై రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆదిలాబాద్ ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు గల కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు. ఇరుకైన శ్యామ్‌పూర్ బ్రిడ్జిపై ప్రొటెక్షన్ వాల్ లేకపోవడంతో ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని మంత్రులకు తెలిపారు అదికారులు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest