సిరిసిల్ల జిల్లాలో మోగిన ‘రైలు కూత’… బస్వాపూర్ వరకు విజయవంతంగా ట్రయల్ రన్!
సిరిసిల్ల జిల్లాలో మోగిన ‘రైలు కూత’ బస్వాపూర్ వరకు విజయవంతంగా ట్రయల్ రన్! రాజన్న సిరిసిల్ల,ఆగస్టు 30,(తెలంగాణ వాణి ప్రతినిధి): కొత్తపల్లి-మనోహరాబాద్ నూతన రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా, జిల్లా సరిహద్దులోని తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ రైల్వే స్టేషన్ వరకు నిర్వహించిన రైల్వే ట్రయల్ రన్ విజయవంతమైంది. తొలిసారిగా జిల్లా సరిహద్దు ప్రాంతంలోకి రైలు వచ్చి కూత పెట్టడంతో స్థానిక ప్రజలు, రైతులు ఆనందంలో మునిగిపోయారు. సిద్దిపేట మార్గం నుంచి బస్వాపూర్ స్టేషన్ వరకు రైల్వే […]
విద్యార్థులకు షూల పంపిణీ

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి): మండలంలోని పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన షూలను గ్రామ సర్పంచ్ మందాల శ్రావణి-హరీష్ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నూతి మల్లన్న, ఉపాధ్యాయులు గండ్రాతి శ్రీలత, నాగెల్లి సౌజన్య, ఉప సర్పంచ్ పూసాల మల్లేశం, వార్డు సభ్యులు ఎదుల్ల అంజయ్య, కాంపెల్లి కొమురయ్య, […]
అక్రమ ఇంటి నెంబర్ల కేటాయింపుపై అధికారులకు ఫిర్యాదు

ధర్మారం (తెలంగాణ వాణి) ప్రభుత్వ ఫారంబోకు భూములలో అక్రమ ఇంటి నెంబర్లు పొందుతున్నారనే నేపంతో బీ ఆర్ ఎస్ నేతలు శనివారం ధర్మారం మండల తహసిల్దార్ దురిశెట్టి శ్రీనివాస్, ఎంపీడీవో వేముల సుమలతకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాలనుసారం ధర్మారం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పోరంబోకు భూములలో జరుగుతున్న అక్రమ ఇంటి నెంబర్ల కేటాయింపు పై వి ఆర్ ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం […]
పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నూతి మల్లన్న మాట్లాడుతూ… మన భారతీయ సంస్కృతిలో ప్రతీ పండుగకు ఎంతో విశిష్టత ఉంటుందని, ఈ రక్షాబంధన్ సోదరభావానికి ప్రతీక అని, సమాజంలో ఐక్యతకు నిదర్శనం ఈ పండుగ అని అన్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకరికొకరు నేను నీకు రక్ష, నీవు నాకు […]
నీటి గుంటలో మృతదేహం.. కలకలం

చికెన్ సెంటర్‌లో పనిచేస్తున్న వ్యక్తిగా గుర్తింపు శంకరపట్నం (తెలంగాణ వాణి) కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలోని పాత సినిమా థియేటర్ ఆవరణలోని నీటి గుంటలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు అంబాలపూర్ గ్రామానికి చెందిన రావణవేణి శంకర్ (54)గా స్థానికులు గుర్తించారు. శంకర్ కేశవపట్నంలోని చికెన్ సెంటర్లలో పనిచేస్తున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న కుటుంబ […]
మిలాద్ ఉన్ నబీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

టేకులపల్లి, ఆగస్టు 25 (తెలంగాణ వాణి): మిలాద్ ఉన్ నబీ పండుగను ప్రశాంత వాతావరణంలో, సోదరభావంతో జరుపుకోవాలని టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్‌ఐ తిరుపతి సూచించారు. పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై మంగళవారం టేకులపల్లి పోలీస్ స్టేషన్‌లో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్‌ఐ మాట్లాడుతూ పండుగ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా […]
టేకులపల్లి గ్రామపంచాయతీలో ఘనంగా వన మహోత్సవం

టేకులపల్లి, ఆగస్టు 25 (తెలంగాణవాణి) టేకులపల్లి గ్రామపంచాయతీ పరిధిలో “వన మహోత్సవం” కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోడా బాలు నాయక్ ,పంచాయతీ కార్యదర్శి శోభన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకయ్య మరియు ఉప సర్పంచ్ పాల్గొని స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోడా బాలు నాయక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని,నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు.వెంకయ్య పచ్చదనం […]
బోడు, లచ్చగూడెంలో ఘనంగా వనమహోత్సవం

పచ్చదనం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు టేకులపల్లి, ఆగస్టు 25 (తెలంగాణ వాణి): వీబీ–జి పథకంలో భాగంగా టేకులపల్లి మండలంలోని బోడు, లచ్చగూడెం గ్రామపంచాయతీల్లో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచులు పొదెం స్వరూప, ఎదుల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. బోడు గ్రామపంచాయతీ పరిధిలోని గుట్టచెరువు ప్రాంతంలో ఈత, ఖర్జూర మొక్కలను అధికారులు, ప్రజాప్రతినిధులు […]
మల్లవరంలో వనమహోత్సవం కార్యక్రమం.

తల్లాడ, ఆగష్టు 25 (తెలంగాణ వాణి) : వనమహోత్సవంలో భాగంగా మండల పరిధిలో మల్లవరం గ్రామపంచాయతీలో సర్పంచ్ కటి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మల్లవరం టు గంగాదేవిపాడు రోడ్డులో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మొక్కలు నాటడం చాలా అవసరమని గుర్తు చేశారు. అదేవిధంగా గ్రామంలోని ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలలో పొలాలలో విరివిగా మొక్కలు నాటాలని అందుకు అవసరమైన మొక్కలు గ్రామపంచాయతీ […]
ఇశ్రాయేలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీల్ చైర్ పంపిణీ

దివ్యాంగులకు చేయూతనందించడం అభినందనీయం : తల్లాడ కార్యదర్శి శ్రీహరికృష్ణ తల్లాడ, ఆగష్టు 25 (తెలంగాణ వాణి) : సమాజంలో వెనుకబడిన దివ్యాంగులకు స్వచ్ఛంద సేవా సంస్థలు చేయూతనందించడం అభినందనీయమని తల్లాడ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీ హరికృష్ణ అన్నారు. మంగళవారం ఇజ్రాయిల్ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఖమ్మంపాటి ఇశ్రాయేలు ఆధ్వర్యంలో తల్లాడకు చెందిన బత్తుల నాగేంద్రమ్మ అనే దివ్యాంగురాలుకి వీల్ చైర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సెక్రటరీ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అన్నారు. అనంతరం ఇశ్రాయేలు […]