UPDATES  

 పొగాకుకు దూరంగా ఉండాలి.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

ధర్మారం జెడ్పీహెచ్‌ఎస్‌లో టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ అవగాహన సదస్సు

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి): పొగాకు ఉత్పత్తుల వినియోగంతో క్యాన్సర్, గుండె జబ్బులు సహా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, విద్యార్థులు పొగాకుకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని నంది మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సుస్మిత సూచించారు. ధర్మారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో గురువారం టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ (TFYC 4.0)లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్టోబర్ 28 నుంచి 60 రోజుల పాటు చేపట్టనున్న ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగంతో ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్, గుండె జబ్బులు, క్షయ, మధుమేహం, కంటి చూపు మందగించడం, సంతానలేమి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ సుస్మిత తెలిపారు. పొగాకుకు దూరంగా ఉంటే అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు. పాఠశాలల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు నిషేధమని, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం, మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం చట్టరీత్యా నేరమని వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (కోట్పా–2003) ప్రకారం చర్యలు తీసుకుంటారని తెలిపారు. రాబోయే 60 రోజుల పాటు గ్రామాలు, పాఠశాలలు, వివిధ సమాజాల్లో పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఈఓ నరసింహరెడ్డి, హెల్త్ అసిస్టెంట్ దామోదర్‌రెడ్డి, ఆశా కార్యకర్త రూప, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షీలా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 29 October 2026, 4:09 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest