UPDATES  

 బాలలపై లైంగిక నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

పోక్సో చట్టంపై అవగాహన కల్పించిన న్యాయమూర్తి, పోలీసు అధికారులు

వేములవాడ, అక్టోబర్ 28 (తెలంగాణ వాణి):

బాలలపై జరుగుతున్న లైంగిక నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, చిన్నారుల రక్షణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వేములవాడలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బాలల రక్షణ, లైంగిక నేరాల నివారణ, సంబంధిత చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్ మాట్లాడుతూ, చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు చిన్న వయస్సు నుంచే గుడ్ టచ్‌, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. బాలలపై లైంగిక నేరాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయని, నేర తీవ్రతను బట్టి దీర్ఘకాలిక జైలు శిక్షతో పాటు కొన్ని కేసుల్లో మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందని వివరించారు.డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి నేరాలకు పాల్పడే నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకొని, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్ మాట్లాడుతూ, బాలలపై నేరాలను నివారించేందుకు చిన్న వయస్సు నుంచే పిల్లలకు చట్టాలు, వ్యక్తిగత భద్రతపై అవగాహన కల్పించడం అవసరమన్నారు.ఏపీపీ అవధూత రజనీకాంత్ మాట్లాడుతూ, పిల్లలే దేశ భవిష్యత్తుకు పునాదులని పేర్కొన్నారు. బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో) నిబంధనలు, వాటి ఉల్లంఘనలకు ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలను వివరించారు.మహిళా న్యాయవాది తమిరి అన్నపూర్ణ మాట్లాడుతూ, చిన్నారుల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. బాలలపై జరిగే లైంగిక నేరాల గురించి తెలిసినప్పటికీ సమాచారం ఇవ్వకుండా ఉండటం కొన్ని సందర్భాల్లో పోక్సో చట్టంలోని సెక్షన్‌ 21 ప్రకారం శిక్షార్హమవుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో ఏజీపీ బొడ్డు ప్రశాంత్ కుమార్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గొంటి శంకర్, జాయింట్ సెక్రటరీ కనీకరపు శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది కుంట శ్రీనివాస్, బార్ అసోసియేషన్ ఈసీ సభ్యుడు వడ్లకొండ శ్రీకాంత్, నాయిమ నాసారి, రేగుల రాజకుమార్, భీమ మహేష్ బాబు, పాఠశాల ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 28 October 2026, 3:21 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest