పొగాకుకు దూరంగా ఉండాలి.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

ధర్మారం జెడ్పీహెచ్ఎస్లో టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ అవగాహన సదస్సు ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి): పొగాకు ఉత్పత్తుల వినియోగంతో క్యాన్సర్, గుండె జబ్బులు సహా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, విద్యార్థులు పొగాకుకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని నంది మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సుస్మిత సూచించారు. ధర్మారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గురువారం టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ (TFYC 4.0)లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. […]
ఇందల్వాయి తండాల్లో గుప్పుమంటున్న నాటుసారా!
యథేచ్ఛగా విక్రయాలు.. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు? మామూళ్ల వసూళ్లపై ఆరోపణలు.. ఉన్నతాధికారులు స్పందించేనా? ఇందల్వాయి (తెలంగాణ వాణి) ఇందల్వాయి మండలంలోని పలు గిరిజన తండాల్లో నాటుసారా విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ విక్రయాలను అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. మండలంలోని సుమారు 17 గిరిజన తండాల్లో ఇప్పపువ్వు సారా పేరుతో నల్లబెల్లంతో తయారు చేసిన నాటుసారాను విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లీటరు నాటుసారాను రూ.200కు విక్రయిస్తున్నారని, కొన్ని […]
జూలూరుపాడును కరువు ప్రాంతంగా ప్రకటించాలి

రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: సీపీఐ నేత వెంకటేశ్వర్లు జూలురుపాడు (తెలంగాణ వాణి) మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడంపై సిపిఐ జూలూరుపాడు మండల సమితి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, కరువు ప్రభావిత ప్రాంతాల గుర్తింపులో జూలూరుపాడు మండలాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం అన్యాయమని సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు విమర్శించారు. గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని వ్యవసాయ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులు ఎదుర్కొంటున్న […]