సంప్రదాయబద్ధంగా అట్లతద్ది వేడుకలు

టేకులపల్లి, అక్టోబర్ 29 (తెలంగాణ వాణి): టేకులపల్లి మండలంలో అట్లతద్ది వేడుకలు గురువారం ఘనంగా ముగిశాయి. ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణం, బస్టాండ్ సెంటర్ వద్ద మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తుల్లో ఆటపాటలతో సందడి చేశారు. సౌభాగ్యం, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటూ గౌరీదేవికి ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించారు. గోరింటాకు పెట్టుకుని, సంప్రదాయ పిండి వంటలు తయారు చేసుకున్నారు. తంగేడు పూలతో గౌరీదేవిని అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజించారు. అనంతరం ఉయ్యాలలు ఊగుతూ జానపద గేయాలు ఆలపించారు. ముత్తైదువులకు అట్లు, […]