కొత్తగూడెం (తెలంగాణ వాణి): బిఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు పుట్టినరోజు సందర్బంగా పార్టీ శ్రేణులు బొందుగుల శ్రీధర్, సయ్యద్ హైమద్, మాజీ ఉర్దూగర్ చైర్మన్ ఎస్కే అన్వర్ పాషా, పిల్లి కుమార్ ఆధ్వర్యంలో జ్యోతి అనాథ వృద్దాశ్రమంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథాశ్రమంలోని సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. వృద్ధులకు పాలు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు, అభిమానులు వనమా రాఘవకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.





