UPDATES  

 నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

కరీంనగర్‌ టౌన్ , నవంబర్‌ 18 (తెలంగాణ వాణి ప్రతినిధి):నీటి వనరుల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతని కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామ సర్పంచ్‌ భాసవేని సరోజన మల్లేశం యాదవ్‌ అన్నారు. జల్‌ అర్పణ్‌ దివస్‌ను పురస్కరించుకుని గ్రామంలో బుధవారం ఆమె ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటి ప్రాముఖ్యత, నీటి పొదుపు, వనరుల పరిరక్షణపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామస్థులతో నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించి, వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, తాగునీటి సరఫరా వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్‌ సూచించారు. భవిష్యత్‌ తరాలకు నీటి కొరత రాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ హజీముద్దీన్‌, ఏఈ ప్రియాంక, గ్రిడ్‌ డీఈ, ఉపసర్పంచ్‌ గాలిపెల్లి రవీందర్‌, వార్డు సభ్యులు, కార్యదర్శి గొనె రాజమల్లయ్య, అంగన్‌వాడీ కార్యకర్త చంద్రకళ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సుజాత, గ్రామస్థులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 18 November 2026, 7:16 pm Posted by : TELANGANA VANI

నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

కరీంనగర్‌ టౌన్ , నవంబర్‌ 18 (తెలంగాణ వాణి ప్రతినిధి):నీటి వనరుల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతని కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామ సర్పంచ్‌ భాసవేని సరోజన మల్లేశం యాదవ్‌ అన్నారు. జల్‌ అర్పణ్‌ దివస్‌ను పురస్కరించుకుని గ్రామంలో బుధవారం ఆమె ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటి ప్రాముఖ్యత, నీటి పొదుపు, వనరుల పరిరక్షణపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామస్థులతో నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించి, వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, తాగునీటి సరఫరా వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్‌ సూచించారు. భవిష్యత్‌ తరాలకు నీటి కొరత రాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ హజీముద్దీన్‌, ఏఈ ప్రియాంక, గ్రిడ్‌ డీఈ, ఉపసర్పంచ్‌ గాలిపెల్లి రవీందర్‌, వార్డు సభ్యులు, కార్యదర్శి గొనె రాజమల్లయ్య, అంగన్‌వాడీ కార్యకర్త చంద్రకళ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సుజాత, గ్రామస్థులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest