నిజామాబాద్ నవంబర్ 14
(తెలంగాణ వాణి స్పెషల్ కరస్పాండెంట్ టి.ఎన్ రమేష్)
నిజామాబాద్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్ ప్రాంతంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు శనివారం రాత్రి చీతా టీం పోలీసులు దాడి నిర్వహించారు.
ఈ దాడిలో సుజాత, అరుణతో పాటు ఒక విటుడు మరియు మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని సంబంధిత పోలీస్ అధికారులకు తెలియజేయగా, పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసుల నిఘా కొనసాగుతుందని, ఇలాంటి కార్యకలాపాల గురించి ప్రజలకు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరుతున్నారు.



