కోతలు పూర్తయిన కొనుగోళ్లు ఏవి..?

తిమ్మాపూర్, నవంబర్ 18 (తెలంగాణ వాణి ప్రతినిధి):జిల్లాలో వరి కోతలు పూర్తవుతున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు చింతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు రైస్ మిల్లులను కేటాయించకపోవడం, […]
సిద్దిపేట సభకు కాంగ్రెస్ శ్రేణులు కదలిరావాలి

తిమ్మాపూర్, నవంబర్ 18 (తెలంగాణ వాణి ప్రతినిధి):సిద్ధిపేటలో గురువారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభకు తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు మండల ప్రజలు, కార్యకర్తల సౌకర్యార్థం 12 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండలంలోని 23 గ్రామాల నుంచి సభకు […]