మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రమణమూర్తి నాయుడు
పాల్వంచ (తెలంగాణ వాణి) కొత్తగూడెం ముద్దుబిడ్డ, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు 82వ జన్మదినం సందర్భంగా పాల్వంచకు చెందిన రమణమూర్తి నాయుడు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 1వ తేదీ పాల్వంచ పట్టణానికి ఎంతో ప్రత్యేకమైన రోజని, ప్రజలతో ఆత్మీయ అనుబంధం కలిగిన వనమా జన్మదినం రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రమణమూర్తి నాయుడు మాట్లాడుతూ.. వనమా వెంకటేశ్వరరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ప్రజల మధ్య ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.




