సంస్మరణ సభ నిర్వహణ.. అనంతరం అన్నదాన కార్యక్రమం
కొత్తగూడెం, అక్టోబర్ 25 (తెలంగాణ వాణి) తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, మాజీ కార్యదర్శి కీ.శే. మోరే భాస్కరరావు జయంతిని పురస్కరించుకుని కొత్తగూడెం బస్టాండ్ సెంటర్‌లోని చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొని మోరే భాస్కరరావు సేవలను స్మరించుకున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నివాళులర్పించారు. అనంతరం ఆయన జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోగరు రాజశేఖర్, ఎం.డి. హుస్సేన్, రామిళ్ల మధుబాబు, సంకు బాపన అనుదీప్, యాకన్న, అయిలన్న, ఇసూబ్, కొట్టి వెంకటేశ్వర్లు, దామోదర్ యాదవ్, కాపు సీతాలక్ష్మి, బిందు తపస్వి, బాదావత్ శాంతి, కాజా తదితరులు పాల్గొన్నారు.




