పాల్వంచ, అక్టోబర్ 23 (తెలంగాణ వాణి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అజ్మీరా హీరాలాల్ కుమార్తె జోష్నిక తేజ్ ఓనీల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పాల్వంచ పెద్దమ్మగుడి సమీపంలోని భవానీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకకు బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆప్తమిత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జోష్నిక తేజ్‌ను ఆశీర్వదించి, ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, మొగిలి మాస్టర్, ఏలూరి రాజేష్ కుమార్, ఇమ్రాన్, అనిల్, మధుబాబు, మేక రమేష్, హాతీరామ్, హైమద్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.





