ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – జొన్నల రవీందర్
పెద్దపల్లి (తెలంగాణ వాణి జిల్లా ప్రతినిధి) అంపెద్దపల్లి జిల్లా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (పి ఆర్ టి యు టి ఎస్) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జొన్నల రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నల్గొండలో నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో 2026–2028 కాలానికి సంబంధించి ఎన్నికలు నిర్వహించగా, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా జొన్నల రవీందర్ ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక పట్ల ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా జొన్నల రవీందర్ మాట్లాడుతూ, తన ఎన్నికకు సహకరించి, ప్రోత్సహించిన పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గండు కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి కానుగంటి శ్రీనివాస్, అంతర్గాం మండల అధ్యక్షుడు కందుల సతీష్, ప్రధాన కార్యదర్శి ముడుసు లక్ష్మణ్‌తో పాటు యూనియన్ సీనియర్ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను యూనియన్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమం, విద్యారంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జొన్నల రవీందర్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల పలువురు ఉపాధ్యాయులు, యూనియన్ నాయకులు అభినందనలు తెలిపారు.




