UPDATES  

 భార్య, కొడుకు చేతిలో భర్త హతం!

తిమ్మాపూర్,అక్టోబరు 6 ( తెలంగాణ వాణి ప్రతినిధి ):కుటుంబ కలహాలు ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్నాయి. భార్య, కొడుకు కలిసి భర్తపై దాడి చేయడంతో అతడు మృతి చెందిన ఘటన మానకొండూరు మండలం గట్టుదుద్దేనపల్లిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కప్ప రమేష్‌ (43), భార్య సుమలత మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సోమవారంరాత్రి మరోసారి వివాదం తలెత్తడంతో సుమలత, ఆమె కుమారుడు రమేష్‌పై ఇటుకపెళ్లలు, కర్రతో తల, ముఖంపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రమేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ పి.శ్రీలత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 6 October 2026, 1:01 pm Posted by : TELANGANA VANI

భార్య, కొడుకు చేతిలో భర్త హతం!

తిమ్మాపూర్,అక్టోబరు 6 ( తెలంగాణ వాణి ప్రతినిధి ):కుటుంబ కలహాలు ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్నాయి. భార్య, కొడుకు కలిసి భర్తపై దాడి చేయడంతో అతడు మృతి చెందిన ఘటన మానకొండూరు మండలం గట్టుదుద్దేనపల్లిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కప్ప రమేష్‌ (43), భార్య సుమలత మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సోమవారంరాత్రి మరోసారి వివాదం తలెత్తడంతో సుమలత, ఆమె కుమారుడు రమేష్‌పై ఇటుకపెళ్లలు, కర్రతో తల, ముఖంపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రమేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ పి.శ్రీలత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest