UPDATES  

భార్య, కొడుకు చేతిలో భర్త హతం!

తిమ్మాపూర్,అక్టోబరు 6 ( తెలంగాణ వాణి ప్రతినిధి ):కుటుంబ కలహాలు ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్నాయి. భార్య, కొడుకు కలిసి భర్తపై దాడి చేయడంతో అతడు మృతి చెందిన ఘటన మానకొండూరు మండలం గట్టుదుద్దేనపల్లిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కప్ప రమేష్‌ (43), భార్య సుమలత మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సోమవారంరాత్రి మరోసారి వివాదం తలెత్తడంతో సుమలత, ఆమె కుమారుడు రమేష్‌పై ఇటుకపెళ్లలు, కర్రతో తల, ముఖంపై దాడి […]

గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన

పోషణ మాసంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు   దేవరకొండ, అక్టోబర్‌ 5 (తెలంగాణ వాణి ప్రతినిధి) దేవరకొండ మండలం పడమటిపల్లి, ఎల్లారెడ్డిబాయి, తూర్పుపల్లి, వైదోని వంపు గ్రామాల్లో పోషణ మాసం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ఎన్‌. రాధ పాల్గొని గర్భిణులు, బాలింతలు, తల్లులకు పోషకాహార విలువలు, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాధ సూచించారు. తక్కువ ఖర్చుతో స్థానికంగా లభించే ఆహార పదార్థాలతోనే శరీరానికి […]

డీఈవో శంభు ప్రసాద్‌ను కలిసిన ట్రస్మా నాయకులు

ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యలపై వినతిపత్రం అందజేత కొత్తగూడెం, అక్టోబర్ 5 (తెలంగాణ వాణి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన విద్యాశాఖ అధికారి (డీఈవో)గా బాధ్యతలు స్వీకరించిన శంభు ప్రసాద్‌ను తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) జిల్లా నాయకులు, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఈవో శంభు ప్రసాద్‌కు ట్రస్మా నాయకులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రైవేట్ పాఠశాలలు, విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న […]

అక్రెడిటేషన్ల జారీలో యామిని పెత్తనం

హైదరాబాద్, అక్టోబర్ 5 (తెలంగాణ వాణి) జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియలో భాగంగా జరిగే రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశంలో సమాచార శాఖలో పనిచేస్తున్న ఒక మహిళా అధికారిని చక్రం తిప్పడం, ఈ విషయంలో చైర్మన్ ఆమెకు అనుకూలంగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ సభ్యులు ఆస్కాని మారుతి సాగర్ అవేదన వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన రాష్ట్ర స్థాయి […]

సంస్కృతి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సీజ్‌ చేసిన విద్యాశాఖ అధికారులు

శేరిలింగంపల్లి, అక్టోబర్‌ 5 (తెలంగాణ వాణి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌ డివిజన్‌ గోల్డెన్‌ టులిప్‌లోని సంస్కృతి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను విద్యాశాఖ అధికారులు సీజ్‌ చేశారు. పాఠశాల అనుమతులు, నిబంధనలపై విద్యార్థి నాయకులు చేసిన వరుస ఫిర్యాదులు, సుదీర్ఘ పోరాటం నేపథ్యంలో డీఈఓ ఆదేశాల మేరకు మండల విద్యాశాఖ అధికారి వెంకటయ్య ఆధ్వర్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. సుమారు 1,500 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాల సుమారు 4,000 గజాల స్థలంలో కొనసాగుతున్న […]