UPDATES  

 🚨 సైబర్ మోసాలకు చెక్ పెట్టాలంటే అప్రమత్తతే ఆయుధం 🚨

  • సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తే రక్షణ.. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

  • సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి: ఎస్పీ మహేష్ బి. గితే

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 7 (తెలంగాణ వాణి ప్రతినిధి):

సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ ముందస్తు అప్రమత్తతతో వ్యవహరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగిస్తూ వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా సైబర్ టీమ్ ఆధ్వర్యంలో అగ్రహారంలోని JNTUH కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ హాజరై సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సైబర్ నేరాలపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ప్రధాన సమస్యల్లో డ్రగ్స్ వినియోగం, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాల్లో విస్తరిస్తున్నాయని, వాటి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ప్రధాన రక్షణ అన్నారు.

ప్రధానంగా ఆర్థిక మోసాలు, సోషల్ మీడియా ఆధారిత నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు. మహిళలను లక్ష్యంగా చేసుకునే సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని వ్యక్తిగత వివరాలు, ఫొటోలు సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని, డబ్బులు డిమాండ్ చేయడం వంటి నేరాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు.

నకిలీ సోషల్ మీడియా ఖాతాలు, ఫేక్ లింకులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, గిఫ్ట్ ఆఫర్లు, లక్కీ డ్రా పేర్లతో జరిగే మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యాశ, భయం, అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే భయపడకుండా 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే National Cyber Crime Reporting Portal ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ముఖ్యంగా మోసం జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేస్తే డబ్బును నిలిపివేసే లేదా తిరిగి పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని వివరించారు.ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఆర్‌ఎస్‌ఐ జునైద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లోన్ యాప్స్, షేర్ మార్కెట్ మోసాలు, APK ఫైల్స్, కొరియర్ ఫ్రాడ్, క్రెడిట్ కార్డ్ మోసాలు, మ్యాట్రిమోనీ మోసాలు, లాటరీ, గిఫ్ట్ ఫ్రాడ్, మల్టీ లెవల్ మార్కెటింగ్, క్రిప్టో కరెన్సీ, డిజిటల్ అరెస్ట్ తదితర సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.విద్యార్థులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని ఎస్పీ సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్, సైబర్ క్రైమ్ ఆర్‌ఎస్‌ఐ జునైద్, JNTUH కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్, అధ్యాపకులు, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 7 October 2026, 1:37 pm Posted by : TELANGANA VANI

🚨 సైబర్ మోసాలకు చెక్ పెట్టాలంటే అప్రమత్తతే ఆయుధం 🚨

సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తే రక్షణ.. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి: ఎస్పీ మహేష్ బి. గితే

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 7 (తెలంగాణ వాణి ప్రతినిధి):
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ ముందస్తు అప్రమత్తతతో వ్యవహరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగిస్తూ వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా సైబర్ టీమ్ ఆధ్వర్యంలో అగ్రహారంలోని JNTUH కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ హాజరై సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సైబర్ నేరాలపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ప్రధాన సమస్యల్లో డ్రగ్స్ వినియోగం, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాల్లో విస్తరిస్తున్నాయని, వాటి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ప్రధాన రక్షణ అన్నారు.

ప్రధానంగా ఆర్థిక మోసాలు, సోషల్ మీడియా ఆధారిత నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు. మహిళలను లక్ష్యంగా చేసుకునే సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని వ్యక్తిగత వివరాలు, ఫొటోలు సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని, డబ్బులు డిమాండ్ చేయడం వంటి నేరాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు.

నకిలీ సోషల్ మీడియా ఖాతాలు, ఫేక్ లింకులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, గిఫ్ట్ ఆఫర్లు, లక్కీ డ్రా పేర్లతో జరిగే మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యాశ, భయం, అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే భయపడకుండా 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే National Cyber Crime Reporting Portal ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ముఖ్యంగా మోసం జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేస్తే డబ్బును నిలిపివేసే లేదా తిరిగి పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని వివరించారు.ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఆర్‌ఎస్‌ఐ జునైద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లోన్ యాప్స్, షేర్ మార్కెట్ మోసాలు, APK ఫైల్స్, కొరియర్ ఫ్రాడ్, క్రెడిట్ కార్డ్ మోసాలు, మ్యాట్రిమోనీ మోసాలు, లాటరీ, గిఫ్ట్ ఫ్రాడ్, మల్టీ లెవల్ మార్కెటింగ్, క్రిప్టో కరెన్సీ, డిజిటల్ అరెస్ట్ తదితర సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.విద్యార్థులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని ఎస్పీ సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్, సైబర్ క్రైమ్ ఆర్‌ఎస్‌ఐ జునైద్, JNTUH కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్, అధ్యాపకులు, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest