UPDATES  

NEWS

 మురికి కాలువ పక్కన శిశువు మృతదేహం

కేశవపట్నంలో కలకలం.. కుక్కలు తవ్వడంతో వెలుగులోకి

శంకరపట్నం, సెప్టెంబర్ 30 (తెలంగాణ వాణి):

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రం కేశవపట్నం గ్రామంలోని 9వ వార్డు మెయిన్‌ రోడ్డులో మురికి కాలువ పక్కన శిశువు మృతదేహం బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బుధవారం మధ్యాహ్నం మురికి కాలువ సమీపంలోని రాళ్ల పక్కన కుక్కలు మట్టిని తవ్వడంతో శిశువు మృతదేహం బయటపడినట్లు స్థానికులు తెలిపారు.

మురికి కాలువ పక్కనే చిన్న గోతిని తవ్వి శిశువును పాతిపెట్టినట్లు కనిపిస్తోందని స్థానికులు, అటుగా వెళ్తున్న ప్రయాణికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం కొన్ని రోజులుగా అక్కడే ఉండటంతో కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లినట్లు తెలుస్తోంది. ఆ దుర్వాసనకు కుక్కలు అక్కడికి చేరుకుని మట్టిని తవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

బయటపడిన మృతదేహం శిశువుదిగా గుర్తించినప్పటికీ, అది ఆడ శిశువా, మగ శిశువా అన్నది స్పష్టంగా తెలియని పరిస్థితి నెలకొంది. శిశువు కాళ్లు ముడుచుకున్న స్థితిలో కనిపించడంతో ఘటనను చూసిన స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

మానవత్వం మంటగలిసిన వేళ.. పసికందును పాతిపెట్టిన దారుణం

తల్లి పొత్తిళ్లలో వెచ్చగా పెరగాల్సిన పసికందు.. పుట్టిన కొద్దిరోజులకే మురికి కాలువ పక్కన మట్టిలో సమాధి కావడం స్థానికులను కలచివేసింది. అసలు శిశువు ఎవరు? ఎక్కడ జన్మించింది? పుట్టిన వెంటనే ఎందుకు పాతిపెట్టాల్సి వచ్చింది? ఈ ఘటన వెనుక ఎవరున్నారు? అన్న ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.

కనీసం పసికందు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాల్సిన మానవత్వం కూడా లేకుండా, గుట్టుచప్పుడు కాకుండా మురికి కాలువ పక్కన గోతిలో పాతిపెట్టడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో మానవత్వం విలువలు క్షీణిస్తున్నాయా అన్న ఆందోళనను ఈ ఘటన కలిగిస్తోందని పలువురు పేర్కొన్నారు. అధికారుల విచారణకు డిమాండ్ శిశువు మృతదేహం అక్కడికి ఎలా వచ్చింది? ఎవరు పాతిపెట్టారు? శిశువు మృతికి కారణమేంటి? అనే విషయాలపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది కానిస్టేబుల్

షఖిల్, శ్రీధర్ రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. గ్రామ సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్ సందర్శించారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 30 September 2026, 3:55 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest