UPDATES  

 స్వచ్ఛ మిషన్లో భాగంగా శ్రమదానం..

స్వయంగా మొట్లను మోసిన సర్పంచ్ భర్త హరీష్

ధర్మారం, (తెలంగాణ వాణి): స్వచ్ఛభారత్ మిష న్ లో భాగంగా ధర్మారం మండలంలోని పత్తిపాక గ్రామంలో గురువారం స్థానిక సర్పంచ్ మాందాల శ్రావణి హరీష్ అద్వర్యంలో గ్రామ ప్రజలు యువత స్వచ్ఛంద సేవకులతో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. మూడు గంటల పాటు నిర్వహించిన ఈశ్రమధాన కార్యక్రమంలో రోడ్డుకు ఇరువైపున ఉన్న చెత్త చెదారం పిచ్చి మొక్కలను ఉపయోగపడని చెట్లను తొలగించి ట్రాక్టర్ లో తరలించారు. ఇక్కడ స్థానిక సర్పంచ్ భర్త హరీష్ ప్రత్యేకంగా మొట్లను ట్రాక్టర్లో వేసి తనవంతుగా కృషి చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళ చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. శ్రమదానం లో పాల్గొన్న స్వచ్ఛంద సమస్త ప్రతినిధులకు గ్రామ ప్రజలకు యువతకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 1 October 2026, 6:21 pm Posted by : TELANGANA VANI

స్వచ్ఛ మిషన్లో భాగంగా శ్రమదానం..

స్వయంగా మొట్లను మోసిన సర్పంచ్ భర్త హరీష్
ధర్మారం, (తెలంగాణ వాణి): స్వచ్ఛభారత్ మిష న్ లో భాగంగా ధర్మారం మండలంలోని పత్తిపాక గ్రామంలో గురువారం స్థానిక సర్పంచ్ మాందాల శ్రావణి హరీష్ అద్వర్యంలో గ్రామ ప్రజలు యువత స్వచ్ఛంద సేవకులతో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. మూడు గంటల పాటు నిర్వహించిన ఈశ్రమధాన కార్యక్రమంలో రోడ్డుకు ఇరువైపున ఉన్న చెత్త చెదారం పిచ్చి మొక్కలను ఉపయోగపడని చెట్లను తొలగించి ట్రాక్టర్ లో తరలించారు. ఇక్కడ స్థానిక సర్పంచ్ భర్త హరీష్ ప్రత్యేకంగా మొట్లను ట్రాక్టర్లో వేసి తనవంతుగా కృషి చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళ చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. శ్రమదానం లో పాల్గొన్న స్వచ్ఛంద సమస్త ప్రతినిధులకు గ్రామ ప్రజలకు యువతకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest