UPDATES  

NEWS

 బీఆర్ఎస్ అవినీతిపై ‘పార్ట్‌ వన్‌.. పార్ట్‌ టూ.. పార్ట్‌ త్రీ’

సిరిసిల్ల సభలో పార్ట్ వన్  

సిద్దిపేట సభలో పార్ట్ టూ  

గజ్వేల్ సభలో పార్ట్ త్రీ  

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ 

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) తొమ్మిది ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అవినీతిని ప్రజల ముందు ఉంచడానికి సిరిసిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో గొర్రెలు మేకలకు రాష్ట్ర ప్రభుత్వం బీమా కల్పించిన సందర్భంగా గొర్రెల పెంపకదారుల సంఘం, అఖిల భారత యాదవ మహాసభ మండల శాఖ అధ్యక్షుడుదాగేటి ఉదయ్ యాదవ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..గొల్ల కురుమల సమస్యలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీమా పథకాన్ని అమలు చేశారన్నారు. గతంలో ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి కి వివరించడం జరిగిందని మంత్రి తెలిపారు. స్పందించిన ముఖ్యమంత్రి బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. తొమ్మిది ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అవినీతిని ప్రజలకు వివరించడానికి సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిసభ నిర్వహిస్తున్నరని అన్నారు. ఇందులో భాగంగా సిరిసిల్లలో పార్ట్ వన్ అవినీతి, సిద్దిపేటలో పార్ట్ టూ అవినీతి, గజ్వేల్ లో పార్ట్ 3 అవినీతిని బయట పెడతామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అనంతరం గొల్ల కురుమ యాదవ మహా సంఘం నాయకులు మంత్రి లక్ష్మణ్ కుమార్ ను గొంగడితో సన్మానించి గొర్రె పిల్లను బహుకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లౌడ్య రూప్లానాయక్, గొల్ల కురువ సంక్షేమ సంఘం నాయకులు వేల్పుల నాగరాజు, జంగ మహేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల ప్రదీప్ రెడ్డి, కడారి అంజయ్య, సర్పంచుల పోరం మండల అధ్యక్షుడు సంఘ రంజిత్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కాడే సూర్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల తిరుపతి, వివిధ గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 30 September 2026, 2:01 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest