ఎన్టీపీసీ రామగుండం ఆధ్వర్యంలో ‘క్లీన్ రివర్–గ్రీన్ ఫ్యూచర్’ కార్యక్రమం
పెద్దపల్లి , సెప్టెంబర్ 27 (తెలంగాణ వాణి జిల్లా ప్రతినిధి) పరిశుభ్రమైన, పచ్చని, ఆరోగ్యకరమైన భవిష్యత్తు లక్ష్యంగా ఎన్టీపీసీ రామగుండం ఆధ్వర్యంలో సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా గోదావరి నది పరివాహక ప్రాంతంలో ప్రత్యేక క్లీన్లీనెస్ డ్రైవ్ నిర్వహించనున్నారు.అంతర్గాం సమీపంలోని గోదావరి నది తీరంలో సెప్టెంబర్ 28న ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గోదావరి నది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొన్నారు.“మన నది – మన బాధ్యత” అనే సందేశంతో నది పరిసరాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం, పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం, నది పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు.నదులు, జల వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రజలు ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు.




