తిమ్మాపూర్, సెప్టెంబరు 27 (తెలంగాణ వాణి ప్రతినిధి) వైజ్ఞానిక, సాంసాంకేతిక ప్రతిభకు ‘టెక్‌ఫెస్ట్’ వేదికకేతిక, సృజనాత్మక ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో నిర్వహించిన మూడు రోజుల జాతీయస్థాయి ‘టెక్‌ఫెస్ట్–2కే26’ ఆదివారం ముగిసింది. కళాశాల సీఈసీ, సీఈసీ (డేటా సైన్స్) విభాగాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.టెక్నికల్ ఈవెంట్లు, ప్రాజెక్టు ప్రదర్శనలు, క్విజ్, కోడింగ్, పేపర్ ప్రజెంటేషన్‌తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు బహుమతులు,ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా కళాశాల జనరల్ సెక్రటరీ డాక్టర్ గండ్ర . శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలతో పాటు సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధ్యాపకులు, ఈవెంట్ కోఆర్డినేటర్లు, విద్యార్థి వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో కళాశాల జాయింట్ సెక్రటరీ డాక్టర్ డి. శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ సభ్యులు వినోద్, సీహెచ్ ప్రకాష్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్, సీఈసీ విభాగాధిపతి డాక్టర్ ఎన్. చంద్రమౌళి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.




