ధర్మారం (తెలంగాణ వాణి) తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి ఆదేశాల మేరకు కొలుముల దామోదర్ యాదవ్ ఎన్నారై కెనడా సౌజన్యంతో ధర్మారం మండలంలోని నంది మేడారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో ఆదివారం విద్యార్థులకు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రిన్సిపల్ విజయతో కలిసి స్థానిక సర్పంచ్ వీర్పాల్ ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు సంతోష్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు చేసి 117 మంది విద్యార్థులకు కంటి అద్దాలు అవసరమని నిర్ధారించారు. అనంతరం సర్పంచ్ వీర్పాల్, ప్రిన్సిపల్ విజయ మాట్లాడుతూ.. విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత కంటి పరీక్షలు చేయించి అద్దాలు అందిస్తున్న కొలుముల దామోదర్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అరిగే రవికుమార్, తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుంచు మల్లేశం, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.





