ఉత్సవ మండపాలను సందర్శించిన కొత్వాల
పాల్వంచ, సెప్టెంబర్ 14 (తెలంగాణ వాణి) ఆదిదేవుడు గణేశుడి ఆశీస్సులే ప్రజలందరికీ శ్రీరామ రక్ష అని, వినాయకుని ఆశీర్వాదం సకల జనులకు ఉండాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచలో వినాయక చవితి సందర్భంగా సోమవారం పూజలు ఘనంగా నిర్వహించారు. పాల్వంచలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాల మండపాలను కొత్వాల సందర్శించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి యర్రంశెట్టి ముత్తయ్య, కార్పొరేటర్ సీరపు సుగుణ, నాయకులు, ఎస్. వి.ఆర్.కె ఆచార్యులు, నూకల రంగారావు, వై.వెంకటేశ్వర్లు, సాదం రామకృష్ణ, చిన్నపండు, బూసి శ్రీను, యాటా నాని, కొండూరి లక్ష్మణ్, బుల్లెట్ శ్రీను,తదితరులు పాల్గొన్నారు.
Post Views: 2




