బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్
శంకరపట్నం (తెలంగాణ వాణి) తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పెన్షన్ అర్హత నిబంధనలను బిజెపి
శంకరపట్నం మండల శాఖ ఖండించింది. గురువారం మండల బిజెపి అధ్యక్షుడు ఏనుగుల అనిల్ పేదలు, వృద్ధులు, వితంతు మహిళలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అంటూనే గతంలోని ప్రభుత్వాల కన్నా పెన్షన్ అర్హతల నిబంధనలు పెంచి వారికి అన్యాయం చేస్తుందని, వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సును 70 నుంచి 57 ఏళ్లకు తగ్గించాలని, వితంతు మహిళలకు వయోపరిమితి లేకుండా పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర అర్హత నిబంధనలను కూడా పునఃసమీక్షించి నిజమైన అర్హులకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే మండల వ్యాప్తంగా శాంతియుత ధర్నాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
కొత్త పెన్షన్ నిబంధనలను బీజేపీ ఖండించింది.
వృద్ధాప్య పెన్షన్ వయస్సును 70 నుంచి 57 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్.
వితంతు మహిళలకు వయోపరిమితి లేకుండా పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి.
ఇతర అర్హత నిబంధనలను పునఃసమీక్షించాలని ప్రభుత్వం కోరింది.
డిమాండ్లు నెరవేరకపోతే మండల వ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
