UPDATES  

 కొండగట్టు ప్రధాన రహదారిపై కూలిన భారీ వృక్షం

కొండగట్టు ప్రధాన రహదారిపై కూలిన భారీ వృక్షం

రెండు వాహనాలు ధ్వంసం, ఒకరికి గాయాలు

జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. కొండగట్టు శివారులోని మెహర్ బాబా ఆలయం ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న ఒక భారీ వృక్షం అకస్మాత్తుగా కూలిపోయింది. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న రెండు వాహనాలపై ఈ చెట్టు పడడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. రహదారికి అడ్డంగా చెట్టు కూలిపోవడంతో ఆ మార్గంలో కొంతసేపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై పడిన చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest