UPDATES  

NEWS

రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు

 రోడ్డెక్కిన అన్నదాతలు

తాలు, తప్ప పేరుతో తూకం పేరుతో ఇబ్బంది పెడుతున్నారంటు ఆందోళన 

 

మల్లాపూర్ మే18,(తెలంగాణ వాణి) మండలంలోని ముత్యంపేటలోని వరి ధాన్యము కొనుగోలు కేంద్రాలలో తాళి తప్ప పేరుతో తూకం ఎక్కువ వేస్తున్నారని మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్ ఆధ్వర్యంలో రైతులతో ధర్నా చేపట్టాడు.ఈసందర్భంగా నాగేష్ మాట్లాడుతూ ముత్యంపేట,రాఘవపేట రెండు గ్రామాలలో సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలోని ధాన్యాన్ని కొనుగోలు చేయగా ముత్యంపేటలో మాత్రమే కిలో ధాన్యాన్ని తాళి తప్ప పేరుతో తూకం వేస్తున్నారని అన్నారు. ఖానాపూర్ మెట్పల్లి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టగా విషయం తెలుసుకున్న మల్లాపూర్ ఎస్సై అనిల్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోకులు ధర్నా చేస్తున్న రైతుల వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. ధర్నా చేస్తున్న రైతులకు మద్దతుగా మాజీ జెడ్పిటిసి సంధిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,ముద్దం శరత్ గౌడ్,డబ్బా రమేష్ రెడ్డి,తెడ్డు రంజిత్,సుద్దాల చిన్న గంగారం,రైతులు ఏజిబి రాజారెడ్డి,మరిపెళ్లి ప్రసాద్,మరిపెళ్లి రవి, బీర్కులనందం,వాకిటి లక్ష్మారెడ్డి, నిమ్మల శేఖర్ రెడ్డి తో పాటు పలువురు రైతులు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest