వేములవాడ, సెప్టెంబర్ 4 (తెలంగాణ వాణి): శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేములవాడ గోశాలలో గోవులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు, 22వ వార్డు కౌన్సిలర్ ఇప్పపూల మమత–అజయ్తో పాటు సభ్యులు గోవులకు అరటి పండ్లు, పచ్చగడ్డిని తినిపించారు.
ఈ సందర్భంగా మమత–అజయ్ మాట్లాడుతూ గోవులకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతమని, శ్రీకృష్ణుడికి ఇష్టమైన గోవులకు సేవ చేయడం కృష్ణ పరమాత్మునికి సేవ చేయడంతో సమానమని అన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎద్దండీ రాజు–సరళ, నిర్వాహకులు పిల్లి బాబురావుతో పాటు ట్రస్ట్ సభ్యులు, గోశాల సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 5


