UPDATES  

NEWS

తల్లి-తండ్రుల పేరిట డప్పు కళాకారులకు దుస్తుల పంపిణీ బీజేపీ విజయం.. బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధికి మహా పాదయాత్ర పిఆర్టియు టిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా జొన్నల రవీందర్ ఏకగ్రీవ ఎన్నిక! తడ్కల్ లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో బోస్లే మోహన్ రావు పటేల్ ప్రత్యేక పూజలు బాపూజీ శాఖ గ్రంధాలయానికి పుస్తకాలు బహుకరణ రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికైన సాయి మణికంఠ విద్యార్తులు నారాయణఖేడ్ యువతకు జాతీయ స్థాయి క్రీడా వసతులు పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఈరవేణి రాజ్‌కుమార్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక ఓట్ల తొలగింపు రాద్ధాంతం కాంగ్రెస్ కుట్రే : మాజీ ఎమ్మెల్యే గుజ్జుల

 వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు

వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు…

 

  • ఆలయ ప్రధాన రహదారి రోడ్డు వెడల్పులో భాగంగా ప్రారంభమైన కూల్చివేతలు…

 

వేములవాడ,జూన్ 15 (తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్) :

ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ పట్టణంలో ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు దృష్ట్యా భద్రతా చర్యలలో భాగంగా జిల్లా అధికారులు,పోలీస్ శాఖ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. బ్రిడ్జి నుండి వేములవాడ రాజన్న ఆలయం వరకు కూల్చివేతల కార్యక్రమాన్ని శాంతియుతంగా, అడ్డంకులు లేకుండా చేపట్టేందుకు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163(3) (సెక్షన్ 144 సీఆర్పీసీ) అమలులోకి తీసుకువచ్చారు.ఈ మేరకు జూన్ 16, 2025 సోమవారం ఉదయం 6 గంటల నుంచి కూల్చివేతల పనులు పూర్తయ్యే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. కూల్చివేతల ప్రాంతమైన ఆలయ ప్రాంగణం నుండి 100 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడటం పూర్తిగా నిషేధించబడినట్లు పేర్కొన్నారు.అధికారుల సూచన మేరకు ప్రజలు సహకరించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని కోరారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 15 June 2025, 8:44 pm Posted by : TELANGANA VANI

వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు

వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు...
 

ఆలయ ప్రధాన రహదారి రోడ్డు వెడల్పులో భాగంగా ప్రారంభమైన కూల్చివేతలు...

 
వేములవాడ,జూన్ 15 (తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్) :

ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ పట్టణంలో ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు దృష్ట్యా భద్రతా చర్యలలో భాగంగా జిల్లా అధికారులు,పోలీస్ శాఖ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. బ్రిడ్జి నుండి వేములవాడ రాజన్న ఆలయం వరకు కూల్చివేతల కార్యక్రమాన్ని శాంతియుతంగా, అడ్డంకులు లేకుండా చేపట్టేందుకు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163(3) (సెక్షన్ 144 సీఆర్పీసీ) అమలులోకి తీసుకువచ్చారు.ఈ మేరకు జూన్ 16, 2025 సోమవారం ఉదయం 6 గంటల నుంచి కూల్చివేతల పనులు పూర్తయ్యే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. కూల్చివేతల ప్రాంతమైన ఆలయ ప్రాంగణం నుండి 100 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడటం పూర్తిగా నిషేధించబడినట్లు పేర్కొన్నారు.అధికారుల సూచన మేరకు ప్రజలు సహకరించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని కోరారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest