UPDATES  

NEWS

శాంతియుత వాతావరణంలో గణేష్ నిమర్జనం జరుపుకోవాలి: ఎస్ఐ అఖిల, ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పౌష్టికాహారంతోనే చిన్నారుల సంపూర్ణ ఎదుగుదల పిడుగుపాటుతో మహిళా వృద్ధురాలి మృతి వినాయక నిమజ్జనంలో అప్రమత్తంగా ఉండాలి గణనాథున్ని దర్శించుకున్న ఎన్నారై హరీష్ రెడ్డి ప్లాస్టిక్ రహిత గ్రామమే లక్ష్యంగా 200 స్టీల్ ప్లేట్లు విరాళం అత్యవసర సమయంలో రక్తదానం చేసిన బాచికి యంగ్ ఇండియన్ బ్లడ్ డోనార్స్ క్లబ్ భద్రాద్రి జిల్లా కార్యదర్శి జుబ్బు అభినందనలు ఎస్‌జీఎఫ్ క్రీడల్లో శ్రీనిధి గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘన విజయం లంచం వసూలుకు ‘సర్వీస్‌బుక్‌’ను అడ్డుపెట్టారా? నేతకాని మహర్ సంఘం ధర్మారం గ్రామ కమిటీ ఎన్నిక

 పౌష్టికాహారంతోనే చిన్నారుల సంపూర్ణ ఎదుగుదల

కౌన్సిలర్ కొండ్లెపు ముత్యం

వేములవాడ,సెప్టెంబర్ 24 (తెలంగాణ వాణి ప్రతినిధి) : పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుందని 17వ వార్డు కౌన్సిలర్‌ కొండ్లెపు ముత్యం,ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ అంజమ్మ అన్నారు. గురువారం వేములవాడ పట్టణంలోని శాస్త్రినగర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ కార్యక్రమంలో ఆమె పాల్గొని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్‌ కొండ్లెపు ముత్యం, మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లితో పాటు శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం సక్రమంగా అందేలా పర్యవేక్షించాలని సూచించారు.అనంతరం గర్భిణీ గిన్నె సితారకు అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా శ్రీమంతం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ అంజమ్మ, అంగన్‌వాడీ టీచర్‌ మిరియాల శోభ, ఆశా వర్కర్‌ విజయ, మున్సిపల్‌ వార్డు ఆఫీసర్‌, అంగన్‌వాడీ సిబ్బంది, బాలింతలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 24 September 2026, 6:10 pm Posted by : TELANGANA VANI

పౌష్టికాహారంతోనే చిన్నారుల సంపూర్ణ ఎదుగుదల

పౌష్టికాహారంతోనే చిన్నారుల సంపూర్ణ ఎదుగుదల
కౌన్సిలర్ కొండ్లెపు ముత్యం

వేములవాడ,సెప్టెంబర్ 24 (తెలంగాణ వాణి ప్రతినిధి) : పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుందని 17వ వార్డు కౌన్సిలర్‌ కొండ్లెపు ముత్యం,ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ అంజమ్మ అన్నారు. గురువారం వేములవాడ పట్టణంలోని శాస్త్రినగర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ కార్యక్రమంలో ఆమె పాల్గొని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్‌ కొండ్లెపు ముత్యం, మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లితో పాటు శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం సక్రమంగా అందేలా పర్యవేక్షించాలని సూచించారు.అనంతరం గర్భిణీ గిన్నె సితారకు అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా శ్రీమంతం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ అంజమ్మ, అంగన్‌వాడీ టీచర్‌ మిరియాల శోభ, ఆశా వర్కర్‌ విజయ, మున్సిపల్‌ వార్డు ఆఫీసర్‌, అంగన్‌వాడీ సిబ్బంది, బాలింతలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest