ధర్మారం (తెలంగాణ వాణి) విధి వక్రీకరించిందో ప్రకృతి ప్రకోపించిందో ఏమో ఆ వృద్ధురాలి పాలిట శాపంగా మారింది. కూలీ పనులకు వెళ్లిన ఆమె శావంగా మారింది. ఆ కుటుంబంలో తీవ్రవిశాదం నిండింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని చామనపల్లి గ్రామానికి చెందిన మారం అంజవ్వ 60 సం”లు అనే వృద్ధురాలు బుధవారం జూలపల్లి మండలంలోని బాలరాజు పల్లి గ్రామంలో పత్తి కలుపుకు కూలి పనులకు ఆటోలో వెళ్ళింది. ఇదే క్రమంలో అకాల వర్షం గాలి వానతో పాటు పిడుగుపాటుకు గురై ఆ వృద్ధురాలు అక్కడికక్కడే పత్తి చేనులో విగత జీవిగా మారింది. ఈ సంఘటన తో ఆమెతో పాటుగా కూలీ పనులకు వెళ్లిన మహిళా కూలీలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మృతురాలికి భర్త ఎల్లయ్య కుమారుడు సాగర్ ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది




