యంగ్ ఇండియన్ బ్లడ్ డోనార్స్ క్లబ్ జాతీయ అధ్యక్షులు జెబి బాలు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు పొందిన ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం జి.మోహన్‌లాల్‌ను సన్మానించారు. 26 ఏళ్లుగా విద్యారంగంలో సేవలందిస్తున్న ఆయన, మైలారం పాఠశాలలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పది మంది విద్యార్థులను చేర్పించి వారికి జనన ధ్రువపత్రాలు, ఆధార్ కార్డులు ఇప్పించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో వారికి కనీస సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం మైలారం పాఠశాలలో 100 మంది విద్యార్థులతో మండలంలో అత్యధిక నమోదు కలిగిన పాఠశాలగా గుర్తింపు పొందారు.


