UPDATES  

NEWS

సింగరేణి ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏనుగుల రాకేష్‌రెడ్డి 679లో కొప్పులకు భూమి లేదని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలరా -రూప్ల పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యే సింగరేణిలో అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి రాజకీయ, విద్యా, సేవా రంగాల్లో వనమా రాఘవేంద్రరావు ఇంజమూరి సత్యనారాయణ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత సమాచార హక్కు ప్రచార సమితి నియోజకవర్గ కార్యదర్శిగా మాదాసు సురేష్ కుట్టుమిషన్ల శిక్షణ పూర్తి చేసిన 40 మంది మహిళలు ఆదిదేవుడు గణేశుడి ఆశీస్సులే మనందరికీ శ్రీరామరక్ష కొత్తగూడెంలో ఉచిత వినాయక విగ్రహాలు పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు

 పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యే

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం

విద్యార్థుల ఆకలిని తీర్చి.. అక్షరానికి అండగా నిలవడమే ధ్యేయం: మంత్రి పొన్నం ప్రభాకర్

రూ.8 కోట్లతో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం

49,025 మంది విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం

కరీంనగర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ వాణి ప్రతినిధి): పిల్లలకు ప్రభుత్వం అందించగలిగే గొప్ప ఆస్తి విద్యేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు ఉదయం ఆకలితో తరగతి గదులకు రాకుండా పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా ఆకలిని తీర్చి అక్షరానికి అండగా నిలవడమే స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ఉద్దేశమన్నారు. కరీంనగర్ మార్కెట్‌యార్డులో తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ పార్ట్‌నర్‌గా కలిసి సుమారు రూ.8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి ప్రారంభించారు. అనంతరం కిచెన్‌లో ఏర్పాటు చేసిన అధునాతన యంత్రాలు, వివిధ విభాగాలను పరిశీలించారు.

విద్యే.. పిల్లలకు గొప్ప ఆస్తి

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో పిల్లల భవిష్యత్‌కు భూములు, ఆస్తులు, నిధులు అందించడం ముఖ్యంగా భావించేవారని, ప్రస్తుత కాలంలో పిల్లలకు అందించగలిగే గొప్ప ఆస్తి విద్యేనని అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన కుటుంబాలు మెరుగైన స్థాయిలో ఉన్నట్లు సర్వేల్లో వెల్లడైన విషయాన్ని ప్రస్తావించారు. అందుకే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు శిక్షణ పొందిన ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచుతున్నామని, ఇప్పుడు విద్యార్థులకు ఉదయమే నాణ్యమైన అల్పాహారం అందించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే కార్యక్రమానికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.

ఆకలితో చదువుకు ఆటంకం ఉండొద్దు

ఆకలితో ఉన్న విద్యార్థులు చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేరని మంత్రి అన్నారు. పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా విద్యార్థుల ఏకాగ్రత, హాజరు, సమయపాలన, తరగతి గది భాగస్వామ్యం, విద్యా పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉదయమే ఉపాధి కోసం వెళ్లే పేద, మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం సమయం, ఆర్థిక పరంగా కొంత ఉపశమనం కల్పిస్తుందని తెలిపారు. అల్పాహారం తయారీ, నిర్వహణ బాధ్యతల నుంచి ఉపాధ్యాయులు విముక్తి పొంది పూర్తిస్థాయిలో బోధనపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

49,025 మంది విద్యార్థులకు ప్రయోజనం

కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్‌కు రోజుకు 50 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందించే సామర్థ్యం ఉందని మంత్రి తెలిపారు. 17 మండలాల్లోని 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఇక్కడి నుంచి అల్పాహారం సరఫరా చేస్తామని చెప్పారు. మొత్తం 49,025 మంది విద్యార్థులు ప్రతిరోజూ ప్రయోజనం పొందనున్నారని వివరించారు. నియోజకవర్గాల వారీగా హుస్నాబాద్‌లో 16,544 మంది, మానకొండూర్‌లో 8,645 మంది, చొప్పదండిలో 7,481 మంది, కరీంనగర్‌లో 16,355 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. రాష్ట్రంలో ఇది ఆరో కమ్యూనిటీ కిచెన్ అని మంత్రి తెలిపారు.

అధునాతన యంత్రాలతో ఆహార తయారీ

కిచెన్‌లో ఇడ్లీ, దోశ, పూరీ, బోండా, సాంబార్ తయారీకి ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేశారు. పాత్రల శుభ్రత కోసం యంత్రాలు, పాల కేంద్రం, ఆహార పదార్థాల పరీక్షా ప్రయోగశాల, కూరగాయలను కట్ చేసి శుభ్రం చేసే యంత్రాలు, చట్నీ పౌడర్ తయారీ యంత్రాలను అందుబాటులో ఉంచారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ఒకే విధమైన నాణ్యతతో, పరిశుభ్రమైన అల్పాహారం అందించడమే కేంద్రీకృత వంటశాలల ఉద్దేశమని మంత్రి తెలిపారు. ఆహార భద్రత, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ISO స్థాయి ప్రమాణాలు పాటించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. థర్మల్ ఇన్సులేటెడ్ వాహనాల ద్వారా పాఠశాలలకు అల్పాహారం సకాలంలో చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఇష్టమైన సాధారణ ఆహార పదార్థాలతో మెనూ రూపొందించామని, ఇందుకోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సహకారం తీసుకున్నామని వెల్లడించారు.

వారంలో ఆరు రకాల అల్పాహారం

వారంలో ఆరు రోజుల పాటు వివిధ రకాల అల్పాహారం అందించనున్నారు. సోమవారం ఇడ్లీ–సాంబార్, మంగళవారం పూరీ–ఆలూ కుర్మా, బుధవారం దోశ–చట్నీ, గురువారం ఉప్మా–చట్నీ, శుక్రవారం మిల్లెట్ ఇడ్లీ–సాంబార్, శనివారం బోండా–చట్నీ అందిస్తారు. రోజు విడిచి రోజు విద్యార్థులకు పాలు కూడా అందించనున్నారు.

కోడంగల్ పైలట్ ప్రాజెక్టుతో మంచి ఫలితాలు

2024 డిసెంబర్‌లో కోడంగల్‌లో స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని మంత్రి తెలిపారు. అక్కడ విద్యార్థుల హాజరు 75 శాతం నుంచి 90 శాతానికి పెరిగినట్లు గుర్తించామని చెప్పారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, తరగతి గది భాగస్వామ్యం, సమయపాలన మెరుగుపడటంతోపాటు ఆలస్యంగా పాఠశాలకు వచ్చే వారి సంఖ్య తగ్గిందన్నారు. అక్కడి ఫలితాల ఆధారంగా కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 17.72 లక్షల మంది విద్యార్థులకు

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17,72,291 మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించేలా స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని విస్తరించే ప్రతిపాదనలు ఉన్నాయని మంత్రి తెలిపారు. 23,106 ప్రభుత్వ పాఠశాలలను కార్యక్రమం పరిధిలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. 31 జిల్లాల్లో 31 కేంద్రీకృత మెగా, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసే ప్రణాళిక ఉందని, ఇందుకోసం సుమారు రూ.245 కోట్ల వ్యయం అంచనా వేసినట్లు తెలిపారు. అల్పాహారం పంపిణీకి సుమారు 1,400 వాహనాలు, 5,000 మంది సిబ్బంది అవసరమవుతారని పేర్కొన్నారు. కేంద్రీకృత వంటశాలల ద్వారా సుమారు 15 వేల ప్రత్యక్ష, 10 వేల పరోక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందన్నారు.

హరే కృష్ణ మూవ్‌మెంట్‌కు ధన్యవాదాలు

స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమంలో ఇంప్లిమెంటేషన్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్న హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సీఏస్ఆర్ నిధుల కింద సంస్థకు సహకరిస్తోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించే కార్యక్రమంలో భాగస్వామిగా నిలిచినందుకు ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణలోనూ హరే కృష్ణ మూవ్‌మెంట్ భాగస్వామిగా ఉందని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి విజిలెన్స్ విచారణ పూర్తయిందని, కళాశాలలకు రావాల్సిన బకాయిలను విడుదల చేస్తున్నామని తెలిపారు.

విద్యార్థులతో కలిసి అల్పాహారం

కిచెన్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం కిచెన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి ఆహార తయారీ, పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్లు శ్రీనివాసరెడ్డి, అశ్వినీ తానాజీ వాకడే, జిల్లా విద్యాధికారి చైతన్య జైని, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో షర్మిల, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కౌంటియా దాస స్వామీజీ, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 16 September 2026, 3:07 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest