UPDATES  

NEWS

 సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం

మాజీల వ్యవహారం నవ్విపోదురు గాక మాకేంటి అన్నట్టుగా ఉంది. సంఘానికి వెన్నుపోటు పొడిచి, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని సంఘం నుండి బహిష్కరణకు గురైన వారు ఇప్పుడు మరో సంఘంలో చేరి మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మీపై ఉన్న ఆరోపణలకు సమాధానాలు చెప్పకుండా వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో ఉపాధ్యాయుల నుండి వసూలు చేసిన బిల్డింగ్ ఫండ్ మొత్తం ఎంత, మండలాల వారీగా ఎంత వసూలు చేశారో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? ఉపాధ్యాయులకు ప్లాట్లు ఇప్పిస్తామని ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసిన 1500 రూపాయలు ప్రస్తుతం ఎవరి ఖాతాలో ఉన్నాయో వెల్లడించగలరా? అలాగే మీ పదవీకాలంలో వసూలు చేసిన సభ్యత్వ రుసుము, జనరల్ ఫండ్ వివరాలు మరియు బిల్డింగ్ ఫండ్ పేరుతో వివిధ రాజకీయ పార్టీల నుండి వసూలు చేసిన చందాల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేసి మీ నిజాయితీని నిరూపించుకోండి. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పితే అదే నిజమవుతుందని భావించడం మానుకోవాలి. ఉపాధ్యాయులు సంఘంపై అభిమానంతో ఇచ్చిన ప్రతి రూపాయి సంఘానికి చెందేలా చేస్తామని, ప్రతి పైసా వసూలు చేస్తామని స్పష్టం చేస్తున్నాం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest