ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యలపై వినతిపత్రం అందజేత
కొత్తగూడెం, అక్టోబర్ 5 (తెలంగాణ వాణి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన విద్యాశాఖ అధికారి (డీఈవో)గా బాధ్యతలు స్వీకరించిన శంభు ప్రసాద్‌ను తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) జిల్లా నాయకులు, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఈవో శంభు ప్రసాద్‌కు ట్రస్మా నాయకులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రైవేట్ పాఠశాలలు, విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం సమర్పించారు. ట్రస్మా ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలపై డీఈవో శంభు ప్రసాద్ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన విద్యా ప్రమాణాలు అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని డీఈవో పేర్కొన్నారు. “భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు అందరి సహకారం అవసరం. విద్యా రంగ అభివృద్ధికి ప్రైవేట్ విద్యాసంస్థల భాగస్వామ్యం కీలకం” అని శంభు ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు బండి లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి భాగం విజయకుమార్, కోశాధికారి మధుసూదన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కిషోర్, చైతన్య, వరప్రసాద్, డాక్టర్ బీఎన్ఆర్, రమేష్, మణికంఠ, చక్రధర్, కోటిరెడ్డి, రాంబాబు, సురేష్, నరసింహారావు, కవిత, పి.రమేష్, కృష్ణప్రసాద్, బోడ పుణ్య నాయక్, కే.వెంకటేశ్వరరావు, ప్రతాపరెడ్డి, శ్రీనివాసరావు, చంద్రమౌళి తదితర ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.




