నిరుద్యోగ యువతకు నాణ్యమైన, ఉచిత పోటీ పరీక్షల శిక్షణ అందించాలనే లక్ష్యంతో కాంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో, Chakravarty E-Classroom భాగస్వామ్యంతో రూపొందించిన “Rakesh Reddy E-Classes App” లాంచ్ కార్యక్రమాన్ని జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు జయరామ్ కోరారు.ఈ సందర్భంగా జయరామ్ మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగ సాధనకు నాణ్యమైన శిక్షణ, సరైన మార్గదర్శకత్వం ఎంతో అవసరమని అన్నారు. అలాంటి సమయంలో నిరుద్యోగ యువతకు పూర్తిగా ఉచితంగా పోటీ పరీక్షల కోచింగ్ అందించే లక్ష్యంతో రూపొందించిన రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పోటీ పరీక్షలకు సంబంధించిన నాణ్యమైన కోర్సులు, స్టడీ మెటీరియల్, మాక్ టెస్టులు, అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన ఒకే వేదికపై అందుబాటులోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ నెల 8వ తేదీ (సోమవారం) ఉదయం 10 గంటలకు కొత్తగూడెం క్లబ్, రైటర్ బస్తీలో నిర్వహించనున్న “Rakesh Reddy E-Classes App Launch & Awareness Program” కు జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత, విద్యార్థులు, యువజన నాయకులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఉద్యోగ సాధనే లక్ష్యంగా కృషి చేస్తున్న ప్రతి విద్యార్థి, నిరుద్యోగ యువకుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ మిత్రులు, సహచరులకు కూడా ఈ కార్యక్రమం గురించి తెలియజేయాలని సూచించారు. యువత భవిష్యత్తు కోసం చేపడుతున్న ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు.వివరాలకు: 96760 16807

