తిమ్మాపూర్, అక్టోబరు 8 ( తెలంగాణ వాణి ప్రతినిధి ): ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్ ఇన్చార్జి ఎస్సైగా జె అరుణ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఆయనను ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్‌కు అటాచ్ చేయడంతో కొత్త బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ విధులు నిర్వహిస్తానని ఇన్చార్జి ఎస్సై జె అరుణ్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ సమస్యలను నేరుగా పోలీసులకు తెలియజేయాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను అరికట్టడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తామని ఆయన పేర్కొన్నారు.




