UPDATES  

 రాజీవ్‌ రహదారిపై మహిళ మెడలో నుంచి మంగళసూత్రం అపహరణ

తిమ్మాపూర్‌,నవంబరు 01 (తెలంగాణ వాణి ప్రతినిధి):ఎల్ ఎం డి పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే మహిళ మెడలోని మంగళసూత్రాన్ని గుర్తుతెలియని దుండగులు అపహరించిన ఘటన తిమ్మాపూర్‌ మండల కేంద్రంలో కలకలం రేపింది. రాజీవ్‌ రహదారిపై ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.వివరాల్లోకి వెళ్తే.. తిమ్మాపూర్‌ మండలంలోని రామకృష్ణ కాలనీకి చెందిన చెంచు లక్ష్మి తన భర్తతో కలిసి శ్రీ చైతన్య పాఠశాలలో ఉన్న కుమారుడిని చూసి ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో తిమ్మాపూర్‌ శివారుకు చేరుకోగానే వెనుక నుంచి మరో ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్మి మెడలోని మంగళసూత్రాన్ని ఒక్కసారిగా లాక్కున్నారు. ఈ పెనుగులాటలో మంగళసూత్రం తాడు తెగిపోవడంతో అందులో ఉన్న సుమారు అర్ధ తులం బంగారు పుస్తెలను దుండగులు అపహరించుకుపోయినట్లు బాధితురాలు తెలిపింది.కాగా, ఎల్‌ఎండీ పోలీస్‌ స్టేషన్‌కు అత్యంత సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు, ఆమె భర్తను విచారించి వివరాలు సేకరించారు. జనసంచారం ఉండే ప్రధాన రహదారిపై, పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోనే చైన్‌ స్నాచింగ్‌ జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుండగులను త్వరితగతిన గుర్తించి పట్టుకోవాలని, రాత్రివేళల్లో రాజీవ్‌ రహదారిపై పోలీసుల నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 1 November 2026, 8:29 pm Posted by : TELANGANA VANI

రాజీవ్‌ రహదారిపై మహిళ మెడలో నుంచి మంగళసూత్రం అపహరణ

తిమ్మాపూర్‌,నవంబరు 01 (తెలంగాణ వాణి ప్రతినిధి):ఎల్ ఎం డి పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే మహిళ మెడలోని మంగళసూత్రాన్ని గుర్తుతెలియని దుండగులు అపహరించిన ఘటన తిమ్మాపూర్‌ మండల కేంద్రంలో కలకలం రేపింది. రాజీవ్‌ రహదారిపై ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.వివరాల్లోకి వెళ్తే.. తిమ్మాపూర్‌ మండలంలోని రామకృష్ణ కాలనీకి చెందిన చెంచు లక్ష్మి తన భర్తతో కలిసి శ్రీ చైతన్య పాఠశాలలో ఉన్న కుమారుడిని చూసి ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో తిమ్మాపూర్‌ శివారుకు చేరుకోగానే వెనుక నుంచి మరో ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్మి మెడలోని మంగళసూత్రాన్ని ఒక్కసారిగా లాక్కున్నారు. ఈ పెనుగులాటలో మంగళసూత్రం తాడు తెగిపోవడంతో అందులో ఉన్న సుమారు అర్ధ తులం బంగారు పుస్తెలను దుండగులు అపహరించుకుపోయినట్లు బాధితురాలు తెలిపింది.కాగా, ఎల్‌ఎండీ పోలీస్‌ స్టేషన్‌కు అత్యంత సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు, ఆమె భర్తను విచారించి వివరాలు సేకరించారు. జనసంచారం ఉండే ప్రధాన రహదారిపై, పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోనే చైన్‌ స్నాచింగ్‌ జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుండగులను త్వరితగతిన గుర్తించి పట్టుకోవాలని, రాత్రివేళల్లో రాజీవ్‌ రహదారిపై పోలీసుల నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest