ప్రాణదాత కటుకం గణేష్ కు జాతీయ సేవారత్న 2024 అవార్డు పురస్కారం
కోరుట్ల (తెలంగాణ వాణి)
అంజలి మీడియా గ్రూప్, అందరి టీవీ పదవ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కాకతీయ మహానంది 2024 అవార్డుల ప్రధానోత్సవం హన్మకొండలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ సామాజికవేత్త, రక్తదాన సంధాన కర్త, ప్రాణదాత కటుకం గణేష్ కు జాతీయ సేవా రత్న- 2024 అవార్డు చైర్మన్ కామిశెట్టి రాజు అందజే శారు. చైర్మన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలకు రక్తదానం చేయించడంలో ముందున్న కటుకం గణేష్ ను అవార్డుతో సత్కరించామని తెలిపారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, అత్యవసర సమయంలో ఒకరు రక్తదానం చేస్తే ముగ్గురిని కాపాడవచ్చు నని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి యువత ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని వారు పేర్కొన్నారు.
Post Views: 254