UPDATES  

NEWS

జనగామ జిల్లా కలెక్టర్ తీరుపై జర్నలిస్ట్ నాయకుల ఫిర్యాదు పచ్చని ఔషధ మొక్కలు అందజేసి ఆశీర్వాదం పొందిన చిన్నారి అఫాన్ జైదీ సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి

 వేములవాడలో మొదలైన రోడ్డు విస్తరణ పనులు

వేములవాడలో మొదలైన రోడ్డు విస్తరణ పనులు…

  • జెసిబి లతో మటన్ మార్కెట్ నిర్మాణాలను తొలగిస్తున్న దృశ్యం…

  • అమరవీరుల స్తూపం నుండి రాజన్న ఆలయం వరకు కూల్చివేతలు…

  • 260 మంది నిర్వాసితుల్లో 60 మందికి పరిహారం…

  • పోలీసుల భారీ బందోబస్తు మధ్య వెడల్పు పనులు…

వేములవాడ,జూన్ 15 (తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్) :

దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి, పట్టణ అభివృద్ధిలో భాగంగా ఆదివారం రోజున అమరవీరుల స్థూపం నుండి రాజన్న ఆలయం వరకు విస్తరణ పనులను ఆర్ అండ్ బి శాఖ, మున్సిపల్ అధికారులు విస్తరణ పనులను ప్రారంభించారు. ప్రభుత్వ, దేవాలయం సంబంధించిన సముదాయ దుకాణాలను జెసిబి లతో తొలగించారు.వేములవాడ పట్టణంలో ట్రాఫిక్ సౌలభ్యం కోసం చేపట్టిన మెయిన్ రోడ్ విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మటన్ మార్కెట్ ప్రాంతంలో నిర్మాణాల తొలగింపులో అధికారుల చర్యలు మొదలయ్యాయి. అమరవీరుల స్తూపం నుండి రాజన్న ఆలయం వరకు ఉన్న నిర్మాణాలపై కూల్చివేతలు కొనసాగుతుండగా,2013 భూ సేకరణ చట్టం ప్రకారంగా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించిన ప్రభుత్వం.260 మంది నిర్వాసితులలో ఇప్పటి వరకు దాదాపు 60 మంది బాధితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించినట్లు సమాచారం. ఇళ్ల స్థలాలు కోల్పోతున్న నిర్వాసితులకు నష్టపరిహారం కింద రూ. 47 కోట్ల 80 లక్షల రూపాయలు కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయని అధికారులు వెల్లడించారు. నిర్వాసితులందరికీ ప్రభుత్వం నష్ట పరిహారం అందజేస్తుందని తెలిపారు. గత 15 రోజుల క్రితమే నిర్వాసితులకు భవనాలు ఇండ్లు ఖాళీ చేయాలని నోటీసులు పంపినట్లుగా అధికారులు తెలియజేశారు.మిగతా నిర్వాసితుల చెక్కులను కోర్టులో జమ చేసినట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం కూల్చివేతలు మూడు,నాలుగు రోజుల్లో పూర్తికావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజల సహకారంతో ఈ పనులు సాఫీగా జరుగుతున్నాయి.పట్టణ అభివృద్ధి దృష్ట్యా ఈ రహదారి విస్తరణ ముఖ్యమని అధికారులు పేర్కొన్నారు. రోడ్డు వెడల్పులు భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సుమారుగా 200 మంది పోలీసుల బందోబస్తు మధ్య రోడ్డు విస్తరణ పనులను అధికారులు పనులను నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆర్ అండ్ బి,దేవాలయ, మునిసిపల్ శాఖల అధికారులతో పాటు సిబ్బంది తదితరులు ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest