MRP కంటే అధిక ధరలకు విక్రయాలు
పాల్వంచ (తెలంగాణ వాణి)
పాల్వంచ రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్ నిత్యావసరాల కోసం వెళ్లే వినియోగదారులను దారుణంగా మోసం చేస్తుంది. MRP కంటే తక్కువకు అమ్మాల్సిన రిలయన్స్ మార్ట్ లో MRP కన్నా అధిక ధరలకు విక్రయిస్తు సామాన్యుణ్ణి బెంబేలెత్తిస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా విక్రయించడం అనేది నేరమని తెలిసి కూడ ఇలా అమ్మడం ఏంటని అడిగిన వినియోగదారుడికి వ్యత్యాసం ఉన్న డబ్బులు తిరిగి ఇస్తామని ఇవన్నీ సాధారణమనట్టు మాట్లాడుతున్న సిబ్బంది ధోరణి విస్మయానికి గురిచేస్తోంది. పాల్వంచ రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్ లో రుచి గోల్డ్ కంపెనీ కి చెందిన నూనె ప్యాకేట్ MRP ధర 125/- రూపాయలు కాగా 10 రూపాయలు ఎక్కువ 135/- కు విక్రయించడం జరిగింది. ఇలా ప్రతి రోజు ఎన్ని ప్యాకెట్ లు అమ్ముతున్నారో అన్నది అలోచించాల్సిన విషయం. పాల్వంచకు చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ప్రాంతాల ఏజెన్సీ వాసులు సూపర్ మార్కెట్ లో తక్కువ ధరకు వస్తాయని ఇక్కడకు వచ్చి నిలువునా మోస పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటిపక్కనున్న షాపులను వదిలి సూపర్ మార్కెట్ మోజులో పడి రిలయన్స్ మార్ట్ కు వెళ్లి మోసపోవద్దని కొన్న వస్తువుల ధరలను చూసుకున్న తర్వాతనే బిల్లులు చెల్లించాలని బాధితులు అంటున్నారు.