UPDATES  

NEWS

వికాస తరంగిణి కొత్తగూడెం శాఖ ఆధ్వర్యంలో రేగళ్లలో జూలై 4న ఉచిత క్యాన్సర్ క్యాంప్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వైద్య సిబ్బంది సేవలు భేష్ కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్ అధ్యక్షతన యోగ దినోత్సవం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్…. శంషాబాద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు…. వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆది దంపతులు

 బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్ (తెలంగాణ వాణి) బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అరెస్ట్ అయ్యారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో వరంగల్ సుబేదారి పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్టు చేసిన అనంతరం అక్కడి నుంచి వరంగల్కి తరలించారు. కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మనోజ్ రెడ్డి అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కమలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్ రెడ్డిని 50 లక్షల రూపాయలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని క్వారీ నిర్వాహకుడు మనోజ్ భార్య ఉమాదేవీ ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై వరంగల్ సుబేదారి పీఎస్లో కేసు నమోదైంది. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని, హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు కౌశిక్ రెడ్డి. కానీ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీలసులు అరెస్టు చేశారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest